నరేంద్రమోడీ: నవాజ్‌షరీఫ్ కూతురు వస్తుందనుకుంటే..!
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఢిల్లీకి వచ్చారు. అయితే ఆయనతో పాటు ఆయన కూతురు మరియం నవాజ్ షరీఫ్ వస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి.
కానీ నవాజ్ షరీఫ్ వెంట మరియం షరీఫ్ రాలేదు. అయితే ఆమెకు బదులు ఆమె సోదరుడు హుస్సేన్, తల్లి కుల్సూంలు ఢిల్లీకి వచ్చారు.
కాగా, ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు భారత అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరిగే నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.

మరియం
పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ షరీఫ్ ఢిల్లీలో సోమవారం జరగనున్న మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి వస్తారని తొలుత ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆమె రాలేదు.

మరియం
పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ షరీఫ్ ఢిల్లీలో సోమవారం జరగనున్న మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి వస్తారని తొలుత ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆమె రాలేదు. నవాజ్ షరీఫ్, భార్య, కొడుకుతో కలిసి వచ్చారు.

మరియం
పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ షరీఫ్ మోడీ తమను ఆహ్వానించిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం పాకిస్తాన్‌లో మాట్లాడుతూ... భారత్, పాక్‌లు శతృత్వాన్ని మర్చిపోయి, స్నేహబంధాన్ని ప్రారంభించాలని ఆకాంక్షించారు.

మరియం
పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ షరీఫ్... భారత్, పాకిస్తాన్ రెండు దేశాలు కూడా ఐక్యతగా ఉండాలని ట్విట్టర్లో అభిప్రాయపడ్డారు.

మరియం
పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ షరీఫ్... కొత్త భారత ప్రభుత్వం, పాకిస్తాన్ మధ్య స్నేహబంధం ప్రారంభమవుతుందని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

మరియం
పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ షరీఫ్... కొత్త ప్రభుత్వం, పాకిస్తాన్ ప్రభుత్వాలు ఇరు దేశాల మధ్య మానసిక అడ్డంకులు, భయాలు, అనమానాలు తొలగించే దిశలో పయనిస్తాయని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

మరియం
నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఢిల్లీకి వచ్చారు. అయితే ఆయనతో పాటు ఆయన కూతురు మరియం నవాజ్ షరీఫ్ వస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ ఆమె రాలేదు.












Click it and Unblock the Notifications