భారత్ పై ఇమ్రాన్ ప్రశంసలు ఇందుకే ? మాజీ ప్రధానుల బాటలో-చాపకింద నీరొచ్చాక-చరిత్ర రిపీట్
చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాకిస్తాన్ లో రాజకీయ నేతలు తమ ప్రత్యర్ధి దేశాలపైనా, నేతలపైనా విమర్శలు చేసుకోవడం సహజమే. కానీ పొగుడుకుంటే మాత్రం అది కచ్చితంగా వార్తే. అదీ స్వదేశంలో రాజకీయంగా చిక్కుల్లో ఉన్నప్పుడు ప్రత్యర్ధి దేశాలపై జనాల దృష్టి మళ్లించే చరిత్ర కూడా ఉన్న వీరిలో ఒకరు ఇప్పుడు తమ ప్రత్యర్ధి దేశాన్ని సరిగ్గా ఇలాంటి పరిస్ధితుల్లోనూ పొగడ్తల్లో ముంచెత్తడంపై అంతర్జాతీయంగా సైతం ఆసక్తికర విశ్లేషణలు వస్తున్నాయి.

భారత్ పై ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు
స్వదేశంలో తనను పదవీచ్యుతుడిని చేసేందుకు విపక్షం దూకుడుగా ముందుకు కదులుతోంది. రేపో మాపో ప్రధాని పదవి ఊడిపోవడం ఖాయం. ఇలాంటి పరిస్ధితుల్లో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రత్యర్ధి దేశం భారత్ పై విమర్శలు చేయడం ద్వారా ప్రజల దృష్టి మళ్లిస్తారని అంతా భావిస్తారు. కానీ ఆయన మాత్రం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తూ భారత్ పై ప్రశంసల జల్లు కురిపించారు. క్వాడ్ దేశాల్లో భాగస్వామిగా ఉంటూ రష్యా-ఉక్రెయిన్ పోరుపై తటస్ధంగా ఉండటం, ఆంక్షలున్నా రష్యా నుంచి చమురు తీసుకోవడం సామాన్యమైన విషయం కాదంటూ మోడీ సర్కార్ పై ఇమ్రాన్ ఖాన్ ప్రశంసల జల్లు కురీపించారు.

పాకిస్తాన్ పాకిస్తాన్ వైఖరికి భిన్నంగా
పాకిస్తాన్ రష్యాకు ఎప్పుడూ అనుకూలమే. ఉక్రెయిన్ తో పోరు ప్రారంభమైన ఫిబ్రవరి 24న రష్యాకు వెళ్లిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. మంచి రోజంటూ రష్యా నిర్ణయాన్ని వెనకేసుకొచ్చారు. పుతిన్ తో భేటీ నైతిక మద్దతు కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు రష్యా అనుకూల పాకిస్తాన్ వైఖరికి భిన్నంగా భారత్ తటస్ధంగా ఉండటాన్ని ఆయన సమర్ధిస్తున్నారు. ప్రజల కోణంలో ఇది మంచి నిర్ణయమని చెప్తున్నారు.తద్వారా పాకిస్తాన్ వైఖరికి భిన్నంగా ఇమ్రాన్ వ్యాఖ్యలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.

ఇమ్రాన్ ప్రశంసల వెనుక ?
ఇమ్రాన్ ఖాన్ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే పాకిస్థాన్ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని ఆయన పూర్తిగా నియంత్రించలేరనే సంకేతాలను ఇస్తున్నట్లు విశ్లేషకులు అబివర్ణిస్తున్నారు. ప్రస్తుతం పాక్ ఆర్మీతో పోరాడుతూ,పదవి కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ఉద్దేశపూర్వంకంగానే భారత్ అనుకూల వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తద్వారా భారత్ తన నిర్ణయాలతో ప్రజలకు ఎలా మేలు చేస్తుందో, పాకిస్తాన్ ఆర్మీ విదేశాంగ విధానం కారణంగా తమ పౌరులకు ఎలా నష్టం జరుగుతుందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకేనని తెలుస్తోంది.

మాజీ ప్రధానుల బాటలోనే..?
గతంలో పాకిస్థాన్ లో శక్తివంతమైన ప్రధానమంత్రులుగా పేరు తెచ్చుకున్న నవాజ్ షరీఫ్, బెనజీర్ భుట్టో, యూసఫ్ రజా గిలానీ తరహాలోనే ఇమ్రాన్ ఖాన్ కూడా భారత్‌తో స్నేహం కోసం ప్రయత్నిస్తున్నారు. పాకిస్తాన్ సైన్యంతో తమ సమీకరణాలు బెడిసికొట్టినప్పుడు భారత ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ వస్తున్నారు. 1999లో నవాజ్ షరీఫ్, అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి రెండు దేశాల మధ్య స్నేహం కోసం బబ్లింగ్ ఎనర్జీని తీసుకొచ్చారు. క్రికెట్ సిరీస్ స్నేహానికి కొత్త విశ్వాసానికి ప్రతిరూపంగా మారింది. అయితే, భారత్‌తో స్నేహం పాకిస్థాన్ ఆర్మీకి అస్తిత్వ ముప్పు కాబట్టి దీనికి ప్రతిగా కార్గిల్ చొరబాటు జరిగింది. ఇందులో ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ భారత్ తో యుద్దం చేసి ఓడిపోయారు.
-
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications