వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాకర్ సూరీడు అస్తమయం: మాంత్రికుడు మారడోనా మృతి, గోల్ ఆఫ్ సెంచరీగా చోటు..

|
Google Oneindia TeluguNews

సాకర్ అంటేనే మారడోనా.. అంతలా పేరు సంపాదించారు. ఫుట్ బాల్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు. గోల్స్ చేస్తూ.. తన రికార్డులు తానే బద్దలు కొట్టేవారు. డ్రగ్స్ తీసుకోవడంతో ప్రభ కాస్త తగ్గిన.. సాకర్ సూరీడిగానే వెలుగొందారు. ఏ కబ్ల్ నుంచి ఆడినా సరే.. మారడోనా ఉంటే విజయం తథ్యం అనే ధీమా ఉండేది. అంతలా పేరు గడించారు.

చివరికీ నవంబర్ 25వ తేదీ బుధవారం రోజున అస్తమించారు. గుండెపోటుతో డిగో మారడోనా హఠాన్మరణం చెందారు. సాకర్ రారాజుగా గుర్తింపు పొందిన ఆయన.. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మెదడులో రక్తం గడ్డ కట్టంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆయనను రక్షించారు. ఆ తరువాత పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన మారడోనాకు.. గుండెపోటు రావడంతో ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు.

సాకర్ మాంత్రికుడు..

సాకర్ మాంత్రికుడు..

అర్జెంటినా సాకర్ మాంత్రికుడు డీగో మారడోనా మృతి ఫుట్ బాల్ ప్రపంచం చిన్నబోయింది. సాకర్‌లో లెజెండ్‌గా నిలిచిన మారడోనాకు ఎందరో అభిమానులు ఉన్నారు. సాకర్‌కు సంబంధించి ప్రపంచ కప్ మ్యాచ్ ఏది జరిగినా మారడోనా పేరు గుర్తుకు తెచ్చుకోవాల్సిందే. ఫుట్ బాల్‌లో మంచి ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్నారు మారడోనా.

ప్రొఫషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్

ప్రొఫషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్

డిగో మారడోనా 1960 అక్టోబరు 30న జన్మించారు. అర్జెంటీనాకు చెందిన ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడిగా మారారు.. 20వ శతాబ్దపు ఫిఫా ప్లేయర్ అవార్డును పొందిన ఇద్దరు విజేతలలో మారడోనా ఒకరు. మారడోనా చూపు, పాసింగ్, బాల్ మీద కంట్రోల్, డ్రిబ్లింగ్ నైపుణ్యాలు ఇతర ఆటగాళ్ళ కంటే మెరుగ్గా వ్యవహరించడానికి అతనికి వీలు కల్పించింది. పొట్టిగా ఉండడంతో అతని శరీరం భూమికి దగ్గరగా ఉండి, అతడు మెరుగైన ఆటగాడు అవడానికి తోడ్పడింది. మైదానంలో అతని ఉనికి, నాయకత్వం అతని జట్టు పై గొప్ప ప్రభావాన్ని చూపాయి.

ఇదీ అతని శైలి

ఇదీ అతని శైలి

మారడోనా సృజనాత్మక సామర్ధ్యాలతో గోల్ చేయడమే లక్ష్యంగా కలిగి ఉండేవారు. ఫ్రీ కిక్ స్పెషలిస్ట్‌గా పేరు పొందారు. చిన్నతనంలో అతను చూపిన ప్రతిభ వల్ల మారడోనాకు ది గోల్డెన్ బాయ్ అనే పేరు వచ్చింది. ఈ పేరు జీవితాంతం ఉండిపోయింది. 1991,1994 లో మాదకద్రవ్యాలు ఉపయోగించారనే ఆరోపణలతో ప్రభ కాస్త తగ్గింది. క్లాసిక్ నంబర్ 10 స్థానంలో ఆడే మారడోనా.. తన క్లబ్ కెరీర్‌లో అర్జెంటీనా జూనియర్స్, బోకా జూనియర్స్, బార్సిలోనా, నాపోలి, సెవిల్లా, న్యూవెల్ యొక్క ఓల్డ్ బాయ్స్ కోసం ఆడారు.

91 క్యాప్స్, 34 గోల్స్

91 క్యాప్స్, 34 గోల్స్

అర్జెంటీనా జట్టులో ఉంటూ తన అంతర్జాతీయ కెరీర్‌లో 91 క్యాప్స్ సంపాదించి 34 గోల్స్ చేశాడు మారడోనా. 1986లో మెక్సికోలో జరిగిన ప్రపంచ కప్‌తో సహా నాలుగు ఫిఫా ప్రపంచ కప్‌లలో మారడోనా భాగస్వామ్యం అయ్యారు. 1986 ఫైనల్‌లో పశ్చిమ జర్మనీపై అర్జెంటీనా కెప్టన్ గా విజయం సాధించారు. టోర్నమెంట్ ఉత్తమ ఆటగాడిగా గోల్డెన్ బాల్‌ను గెలుచుకున్నారు. 1986 ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో, అతను చేసిన రెండు గోల్స్ ఫుట్‌బాల్ చరిత్రలో నిలిచిపోయాయి. మొదటి గోల్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అని.. ఐదుగురు ఇంగ్లాండ్ ఆటగాళ్లను చుట్టి డ్రిబల్ చేస్తూ చేసిన గోల్ రెండో గోల్.. దీనిని 2002 లో ఫిఫా.కామ్ ఓటర్లు గోల్ ఆఫ్ ది సెంచరీగా ఎన్నుకున్నారు.

మారడోనా మృతిపై అనుమానాలు

మారడోనా మృతిపై అనుమానాలు

డిగో మారడోనా మృతితో ఆయన వ్యక్తిగత వైద్యుడు లియోపోల్డో ల్యూక్‌పై విచారణ చేపట్టారు. చికిత్స అందించడంలో ల్యూక్‌ నిర్లక్ష్యమే మారడోనా మరణానికి దారి తీసిందనే సందేహాలు తలెత్తున్నాయి. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఆకస్మిక మరణంపై మారడోనా కుమార్తెలు దల్మా, గియానినా, జనా అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన గుండె పనితీరును దృష్టిలో పెట్టుకుని, సరైన విధంగా చికిత్స అందించనందు వల్లే ప్రాణాలు కోల్పోయిందని అనుమానిస్తున్నారు. ఆ మేరకు విచారణ కొనసాగుతోంది.

English summary
International legend, football player Diego maradona passes away.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X