వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: లాక్‌డౌన్ ఎఫెక్ట్, 60 శాతం పెరిగిన ఇంటర్నెట్ వాడకం, 10 గంటలపాటు ఏకధాటిగా...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ మహమ్మారి అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోతున్నాయి. కంపెనీలు/సంస్థలకు సెలవు ప్రకటించడంతో.. జనం ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. అంత ఇంత కాదు.. ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరగడంతో సర్వర్‌పై ఎఫెక్ట్ పడుతోంది. వైరస్ వల్ల పలు దేశాలు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కొందరు ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తుండగా.. మరికొందరికీ సెలవు ప్రకటించారు. ఇక విద్యార్థులకు పాఠశాల/కళాశాలలు సెలవు ఇచ్చిన సంగతి తెలిసిందే.

60 శాతం అధికం..

60 శాతం అధికం..

వైరస్ వల్ల అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో.. ఏం పని చేయలేక అందరూ మొబైల్, లేదంటే ల్యాపి పట్టుకొని ఉంటున్నారు. ఇంకేముంది ఇంటర్నెట్ మీద గంటలు గంటలు గడుపుతున్నారు. దీంతో బ్రిటన్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు డబుల్ డిజిట్ డేటా వినియోగం అవుతోందని గుర్తించారు. సాధారణ రోజుతో పోల్చితే రోజుకు 60 శాతం ఎక్కువ ఇంటర్నెట్ చూస్తున్నారని పేర్కొన్నది. తమ మొబైల్ డేటా 50 శాతం ఎక్కవగా ప్రజలు వినియోగిస్తున్నారని ప్రముఖ టెలీకాం కంపెనీ వొడాఫోన్ తెలిపింది.

 ఏడాదిలో చూడనివిధంగా..

ఏడాదిలో చూడనివిధంగా..

సాధారణ రోజుల్లో ఇంటర్నెట్‌ ఇంత వినియోగం జరగనిది, సంవత్సరంలో చూడని ఇంటర్నెట్ పెరుగుదల్ల చూస్తున్నారు. వైరస్ వల్ల జన సమూహం అంతా ఇళ్లకే పరిమితం కావడంతో సమస్య వచ్చిందని సిస్కో చీఫ్ టెక్నాలజీ చీఫ్ చింతన్ పటేల్ పేర్కొన్నారు. వినియోగదారుల నుంచి వస్తోన్న డిమాండ్ మేరకు నెట్ అందిస్తామని.. ఇందుకోసం తమకు నెట్ ప్లిక్స్, డిస్నీ లాంటి సంస్థలు తమ బ్యాండ్ విడ్త్ తగ్గించి, వీడియో నాణ్యతను తగ్గించేందుకు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.

4 గంటల నుంచి 10 గంటలు

4 గంటల నుంచి 10 గంటలు

సాధారణంగా రోజు 4 గంటలు ఇంటర్నెట్ వినియోగించేవారు.. ఇప్పుడు 10 గంటలు వాడుతున్నారని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం వెబ్ ట్రాఫిక్‌ను తాము ఎదుర్కొగలమని, కానీ పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం ఇబ్బంది ఎదురవుతోందని తెలిపారు. ఇంటర్నెట్ అంటే న్యూరాన్లు కనెక్ట్ పాయింట్లతో కలిసి పనిచేస్తుందని చెప్పారు. మీరు దానిలో ఒక భాగం కత్తిరించినా.. మిగతా పార్ట్ పనిచేస్తూ ఉంటుందని తెలిపారు.

Recommended Video

Karthik Aryan Spreading Awareness On Covid 19
నాణ్యత తగ్గించండి...

నాణ్యత తగ్గించండి...

ఇంటర్నెట్ వినియోగంతో స్ట్రీమింగ్, వీడియో కాన్ఫరెన్స్‌తో ఎక్కువ ఒత్తిడి చూపుతోందని నిపుణులు తెలిపారు. ఇందుకోసం ఆయా కంపెనీలు స్ట్రీమింగ్, వీడియో నాణ్యత తగ్గించాలని కోరామని ఈయూ కమిషనర్ థియనీ బ్రెటన్ పేర్కొన్నారు. ఇప్పటికే నెట్ ప్లిక్స్, గూగుల్, అమెజాన్ వంటి సంస్థలకు కోరామని తెలిపారు. సోని సంస్థ ఇప్పటికే తాము చెప్పిన అంశాలను ఫాలో అవుతుందని తెలిపారు.

English summary
busy period for streaming in households would normally last around four hours on a weekday evening, that’s now risen to as much as 10 hours a day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X