వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వికీపీడియాలో చొరబాటు: చైనా లక్ష్యాలను ప్రమోట్ చేసేలా కంటెంట్ నియంత్రణ, ఏడుగురు ఎడిటర్లపై వేటు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
వికీపీడియా

వికీపీడియా 'చొరబాటు'కు గురైందని, అందులోని కంటెంట్ చైనా లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించిందని అమెరికాకు చెందిన ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ (స్వచ్ఛంద సంస్థ) తెలిపింది. వికీమీడియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఈ ఎన్‌సైక్లోపీడియాలో కంటెంట్‌ను వలంటీర్లు ఎడిట్ చేస్తుంటారు.

''వికీపీడియా ఉనికికే ఈ చొరబాటు ప్రమాదకరంగా నిలిచిందని'' బీబీసీతో వికీమీడియా ఫౌండేషన్ చెప్పింది.

మెయిన్‌ల్యాండ్ చైనా గ్రూప్‌నకు చెందిన ఏడుగురు ఎడిటర్లపై ఫౌండేషన్ నిషేధం విధించింది.

''ఒక చిన్న వ్యక్తుల సమూహాన్ని నిరాధారంగా దూషిస్తున్నారు'' అని ఫౌండేషన్‌పై మెయిన్‌ల్యాండ్ చైనాకు చెందిన వికీమీడియన్స్ ఆరోపించారు.

వేగంగా ప్రతిస్పందన

వలంటీర్లను ఉద్దేశిస్తూ వెలువరించిన నోట్‌లో ఫౌండేషన్ ఉపాధ్యక్షురాలు మ్యాగీ డెన్నిస్ ''ఈ చొరబాటు పరిధి అసాధారణమైనది'' అని అన్నారు.

ఏడాది కాలంగా 'చైనీస్ లాంగ్వేజ్ వికీపీడియా' చొరబాట్ల గురించి దర్యాప్తు చేస్తున్నామని ఆమె, బీబీసీ న్యూస్‌తో చెప్పారు.

ఈ వేసవిలో 'వలంటీర్ల భద్రత' పరంగా ఎదుర్కొన్న బెదిరింపుల కారణంగా వేగంగా చర్య తీసుకోవాల్సి వచ్చిందని మ్యాగీ వెల్లడించారు.

''మా కంటెంట్‌లో అక్రమంగా పాగా వేస్తోన్న వారితో ఫౌండేషన్ పోరాడుతోంది. ఒక ప్రత్యేకమైన భావజాలానికి అనుకూలంగా వికీపీడియాలోని కంటెంట్‌ను ఎడిట్ చేస్తూ కొన్ని గ్రూప్‌లు లాభం పొందుతున్నాయి'' అని ఆమె రాసుకొచ్చారు.

ఇటీవలే దీని కోసం ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.

కంటెంట్‌పై నియంత్రణ

''చైనా లక్ష్యాలను ప్రమోట్ చేయడానికి చొరబాటుదారులు ప్రయత్నించారు'' అని బీబీసీ న్యూస్‌తో డెన్నిస్ చెప్పారు.

''కంటెంట్‌ను నియంత్రించడమే వారి లక్ష్యం. కానీ దీని గురించి చైనా ప్రభుత్వాన్ని నిందించే పరిస్థితుల్లో నేను లేను. అలా నిందించడానికి తగిన ఆధారాలు కూడా నా దగ్గర లేవు'' అని ఆమె అన్నారు.

కంటెంట్‌పై నియంత్రణ

ఈ ఘటనపై లోతైన, సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాతే 300 మందితో కూడిన మెయిన్‌ల్యాండ్ చైనా గ్రూప్‌లోని ఏడుగురు సభ్యులపై నిషేధం విధించినట్లు వికీపీడియా ప్రకటించింది. అందులో మరో 12 మందిని అడ్మినిస్ట్రేటర్ అధికారాల నుంచి తొలిగించినట్లు చెప్పింది.

శక్తిమంతమైన అడ్మినిస్ట్రేటర్ పదవుల ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నట్లు, తద్వారా ఎడిటింగ్ ప్రక్రియ కూడా ప్రమాదంలో పడుతోందని పౌండేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

సంస్థలోని ఇతర ఎడిటర్లను కూడా వారి ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా సూచించింది.

ఏడుగురు సభ్యుల నిషేధంపై స్పందిస్తూ మెయిన్‌ల్యాండ్‌ చైనాకు చెందిన వికీమీడియన్స్ ''ఒక సమాజం భావాలు, అభిప్రాయాలకు విరుద్ధంగా వికీమీడియా పౌండేషన్ పనిచేస్తోందని'' ఆరోపించారు.

మెయిన్‌ల్యాండ్ చైనాకు చెందిన వికీమీడియన్స్‌, హాంకాంగ్ వలంటీర్లకు మధ్య ఉన్న సంఘర్షణలపై అవగాహనతోనే పౌండేషన్ తగిన చర్యలు తీసుకుందని డెన్నిస్ స్పష్టం చేశారు.

రాజకీయ వార్తల పరంగా 'ఎడిటర్ల మధ్య పోటీ యుద్ధ వాతావరణం' నెలకొందని జూలైలో హాంకాంగ్ ఫ్రీ ప్రెస్ పేర్కొంది.

హాంకాంగ్ ఆపిల్ దినపత్రిక మూసివేయడంతో పాటు, దాని యాజమాన్యాన్ని అరెస్ట్ చేయడంతో పరిస్థితులు మరింత దిగజారాయి.

''చైనీస్ మీడియాను విశ్వసనీయ వార్తా వనరుగా ఉపయోగించుకోవాలని వికీపీడియా ఆర్టికల్స్ ద్వారా మెయిన్‌ల్యాండ్ చైనా వికీమీడియన్స్, ప్రజలపై ఒత్తిడి పెంచుతున్నట్లు'' హాంకాంగ్ ఫ్రీ ప్రెస్ ఆరోపించింది.

ఆపిల్ దినపత్రిక

హాంకాంగ్ ఎడిటర్లపై, నగరంలోని నేషనల్ సెక్యూరిటీ పోలీస్ హాట్‌లైన్‌కు రిపోర్ట్ చేయడం గురించి కొంతమంది ఆన్‌లైన్ చాట్ గ్రూప్‌లలో చర్చించినట్లు వెల్లడైంది.

''ప్రస్తుతం హాంకాంగ్ వికీపీడియా కమ్యూనిటీకి చెందిన కొందరు సభ్యులు... రాజకీయంగా సున్నితమైన కథనాలపై వ్యాఖ్యానించడానికి భయపడుతున్నారని'' హాంకాంగ్ ఫ్రీ ప్రెస్ రిపోర్టర్ సెలీనా చెంగ్, బీబీసీ న్యూస్‌తో అన్నారు.

'' తమ గుర్తింపు బయటికొస్తే, తమను టార్గెట్ చేస్తారని హాంకాంగ్ వినియోగదారులు భయపడ్డారు'' అని ఆమె చెప్పారు.

వారు వికీమీడియా ఫౌండేషన్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ బృందాన్ని తమకు సహాయం చేయాల్సిందిగా కోరారు.

పక్షపాత సమాచారం

సెక్యూరిటీ హెచ్చరికలు రావడంతో ప్రతిస్పందనగా వికీమీడియా ఫౌండేషన్ వారాల క్రితమే వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం యాక్సెస్‌ను నిరోధించింది. దీంతో చైనాతో సహా మరో రెండు ప్రాంతాల్లో వికీపీడీయా బ్లాక్ చేయబడింది.

ఫౌండేషన్ తీసుకున్న చర్యల కారణంగా డేటా దుర్వినియోగం జరగలేదని డెన్నిస్ వెల్లడించారు.

డేటా చొరబాటుదారులను ఎదుర్కోవడానికి ప్రస్తుతం తీసుకున్న చర్యలు అత్యవసరం. ఎందుకంటే స్థానిక సమావేశాలకు హాజరు కావడం, లేదా వ్యక్తిగత ఈమెయిల్స్ చిరునామాలను ఇతరులతో పంచుకోవడం ద్వారా వ్యక్తులు ప్రమాదాల బారిన పడుతుంటారు. అందుకే ఈ కఠిన చర్యలు అత్యవసరం.

ప్రమాదకర హాని

''కొంతమంది వలంటీర్లు నిజాయితీగా, విశ్వసనీయంగా పనిచేయడం లేదనే మీకు కచ్చితంగా తెలిసినప్పుడు... అలాంటి వ్యక్తులకు యాక్సెస్‌ను నిరోధించడం అత్యవసరం. ఇలాంటి సందర్భాల్లోనే వినియోగదారులపై నిషేధం విధించాం. తద్వారా వికీపీడియా కమ్యూనిటీని కాపాడాలని అనుకున్నాం.'' అని డెన్నిస్ తెలిపారు.

వికీపీడియాను సంరక్షించడానికి మాత్రమే ఈ చర్యలు తీసుకున్నాం. అంతేకానీ చైనీస్ ఎడిటర్లు ఇందులో చేరకుండా నిరుత్సాహపరిచేందుకు కాదు అని ఆమె వెల్లడించారు.

''మీరు సురక్షితమైన, అత్యంత భద్రతతో కూడిన ఉత్పాదక వాతావరణంలో పనిచేసేందుకు కావాల్సిన సాధనాలను సమకూర్చుతాం. భవిష్యత్‌లో కూడా వికీపీడియాలో పని చేసేందుకు కావాల్సిన మద్దతు ఇవ్వడానికి మేం కట్టుబడి ఉన్నాం'' అని 4000 మంది చైనీస్ లాంగ్వేజ్ వికీమీడియన్లను ఉద్దేశించి రాసిన లేఖలో డెన్నిస్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Intrusion into Wikipedia: Content control to promote China's goals, seven editors hunted down
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X