వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేరస్తురాలి ఒక కన్ను గుడ్డిదయ్యేలా చేయండి: సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు

ఓ మహిళపై యాసిడ్ పోసి ఆమె కంటి చూపు పోవడానికి కారణమైన కేసులో.. నేరస్తురాలికి కూడా ఒక కన్ను గుడ్డిదయ్యేలా చేయమని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అంకారా: ఓ మహిళపై యాసిడ్ పోసి ఆమె కంటి చూపు పోవడానికి కారణమైన కేసులో సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. నేరస్తురాలికి కూడా కన్ను గుడ్డిదయ్యేలా చేయమని ఆదేశిస్తూ.. ఇందుకు ఇస్లామిక్ షరియా చట్టాన్ని ఉటంకించింది.

కాకపోతే ఈ రకమైన తీర్పును ఇచ్చింది మన సుప్రీంకోర్టు కాదు, ఈ ఘటన జరిగింది కూడా మన దేశంలో కాదు.. ఇరాన్ లో. వివరాల్లోకి వెళ్తే... ఇరాన్ లోని డెహ్డష్ట్ నగరంలో రెండేళ్ల క్రితం ఓ మహిళ మరో మహిళపై యాసిడ్ పోసింది.

ఈ ఘాతుక చర్య కారణంగా బాధితురాలు సీమాకి కంటిచూపు పోయింది. ఆ తరువాత కూడా ఇరాన్ లో ఎంతోమందిపై ఇలాంటి యాసిడ్ దాడులు జరిగాయి. కానీ సీమా కేసులో గురువారం ఇరాన్ సుప్రీం కోర్టు ఇస్లామిక్ షరియా చట్టాన్ని పరిగణనలోనికి తీసుకుని సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది.

Iran to blind woman as punishment for acid attack

ఈ కేసులో నేరస్తురాలికి ఒక కన్ను గుడ్డిదయ్యేలా చేయమంటూ ఆదేశించింది. తీర్పు సందర్భంగా షరియా చట్టాన్నిఉటంకిస్తూ.. ''కంటికి కన్ను అని ఈ చట్టం చెబుతోంది..'' అని పేర్కొంది.

దీంతోపాటు నేరస్తురాలికి ఏడేళ్ల జైలు శిక్ష కూడా విధిస్తూ.. బాధితురాలికి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. తస్నీమ్ అనే వార్తాసంస్థ ఈ వివరాలను వెల్లడించింది.

1979లో ఇస్లామిక్ విప్లవం అనంతరం ఇరాన్ లో షరియా చట్టం అమలులోకి వచ్చింది. శారీరక గాయాలు ఏర్పడిన కేసుల్లో ప్రతీకరా శిక్షలకు ఈ చట్టం అనుమతిస్తోంది. అయితే బాధితులు, వారి కుటుంబ సభ్యలు దయ చూపి.. ఈ శిక్ష అమలు కాకుండా చేయవచ్చని కూడా షరియా చట్టం చెబుతోంది.

English summary
Iran's supreme court has ruled that a woman must be blinded in one eye as punishment for an acid attack that left her victim sightless, using the principle of "eye for an eye" of Islamic Sharia law. The convicted attacker was found guilty of throwing acid in the face of her victim, identified as Sima, two years ago in the city of Dehdasht.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X