Iran Israel War : ఏ క్షణమైనా ఇజ్రాయెల్ పై వార్ ? సీజ్ ఫైర్ లేదన్న ఇరాన్..!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మరోసారి యుద్ద మేఘాలు కమ్ముకుంటున్నాయి. గతంలో ఓసారి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్దం జరిగింది. దీంతో జోక్యం చేసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం చేయడంతో కాల్పుల విరమణ జరిగింది. అయితే ఇప్పుడు ఆ కాల్పుల విరమణ అమల్లో లేదని ఇవాళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఏ క్షణమైనా ఇజ్రాయెల్ పై యుద్దం తప్పదని హెచ్చరికలు జారీ చేసింది.
ఇజ్రాయెల్ తో గతంలో కుదిరిన కాల్పుల విరమణ నుంచి తప్పుకోవాలని ఇరాన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలని తమ బలగాలను అప్రమత్తం చేస్తోంది. ఈ మేరకు ఇరాన్ కు చెందిన సైనిక, న్యాయ, ప్రభుత్వ పెద్దలంతా అలర్ట్ అవుతున్నారు. ఏ క్షణమైనా యుద్దం తిరిగి ప్రారంభం కావొచ్చని కింది స్థాయి అధికారులకు సందేశాలు పంపుతున్నారు.

యుద్దంపై ప్రకటనలు చేసిన వారిలో న్యాయవ్యవస్థ ప్రతినిధి అస్గర్ జహంగీర్, ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీకి సీనియర్ సైనిక సలహాదారు యాహ్యా రహీమ్ సఫావి , రక్షణ మంత్రి బ్రిగేడియర్ జనరల్ అజీజ్ నసీర్జాదేహ్ ఉన్నారు. వీరంతా ఇరాన్ సాయుధ దళాలు అప్రమత్తంగా ఉండి, ఘర్షణలు తిరిగి ప్రారంభమైతే సంఘర్షణకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఇజ్రాయెల్ దుస్సాహసానికి దిగితే గతం కంటే మెరుగ్గా అభివృద్ధి చేసిన క్షిపణులతో ఆ దేశానికి జవాబిస్తామని రక్షణమంత్రి నసీర్జాదే హెచ్చరించారు. గతంలో ఉపయోగించిన వాటితో పోలిస్తే ఇవాళ చాలా మెరుగైన సామర్థ్యాలతో క్షిపణులను తయారు చేసి మోహరించామని ఆయన తెలిపారు. యూదు శత్రువు మరొక సాహసయాత్రకు దిగితే తాము ఖచ్చితంగా ఈ క్షిపణులను ఉపయోగిస్తామని ఆయన ప్రభుత్వ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

"గతంలో ఉపయోగించిన వాటితో పోలిస్తే నేడు మనం చాలా మెరుగైన సామర్థ్యాలతో క్షిపణులను తయారు చేసి మోహరించాము మరియు జియోనిస్ట్ శత్రువు మరొక సాహసయాత్రకు దిగితే, మేము ఖచ్చితంగా ఈ క్షిపణులను ఉపయోగిస్తాము" అని ఆయన ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌తో మాట్లాడుతూ అన్నారు. తమకూ, ఇజ్రాయెల్ , అమెరికా మధ్య ఎటువంటి ప్రోటోకాల్ లేదని, కాల్పుల విరమణ లేదని ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీకి సీనియర్ సైనిక సలహాదారు యాహ్యా రహీమ్ సఫావి తేల్చేశారు.












Click it and Unblock the Notifications