వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేప్ తప్పించుకునే క్రమంలో హత్య, ఇరాన్ యువతికి ఉరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

టెహ్రాన్: మాజీ ఇంటెలిజెన్స్ అధికారి మెర్తేజా అబ్దులాలి సర్బంది హత్య కేసులో ఐదేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న 26 ఏల్ల మహిళను ఇరాన్ శనివారం ఉరితీసింది. ఆమె శిక్ష పైన పునరాలోచించాలని అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిళ్లను ఇరాన్ తోసి పుచ్చింది. రెహానే జబ్బార్‌ను డాన్‌లో ఉరి తీసినట్లు ఆ దేశ అధికార వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది.

తన పైన లైంగిక దాడికి పాల్పడిన నేపథ్యంలోనే.. ఆత్మహక్షణార్థం జబ్బార్.. సర్బంది పైన దాడి చేసిందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమీటీ పర్యవేక్షకుడు ఒకరు తెలిపారు.

అత్యాచారం చేయబోయిన వ్యక్తిని హత్య చేయడమే ఆమె చేసిన నేరంగా భావించి ఉరితీయడాన్ని అందరు తప్పు పట్టారు. ఉరితీయబడ్డ 26 ఏల్ల రెహానే జబ్బారీ.. ఇంటీరియర్‌ డిజైనర్‌గా పని చేసేవారు. ఆమెను ఇరాన్‌ నిఘా సంస్థ మాజీ అధికారి మోర్తజా అబ్దులాలి సర్బందీ తన అపార్ట్‌మెంట్‌లోని కార్యాలయాన్ని సరికొత్తగా తీర్చిదిద్దడం కోసం 2007 ఏప్రిల్‌లో తీసుకెళ్లాడు.

Iran hangs woman convicted of killing alleged rapist

తీరా అక్కడికి వెళ్లాక ఆమెపై అత్యాచారం చేయబోయాడు. తననుతాను కాపాడుకునే ప్రయత్నంలో ఆమె కత్తితో పొడవడంతో అతడు మరణించాడు. దీంతో 2009 లో న్యాయస్థానం ఆ యువతికి మరణశిక్ష విధించింది. అయితే, షరియా చట్టం ప్రకారం హతుడి కుటుంబం క్షమాభిక్ష పెడితే ఆమె మరణశిక్ష యావజ్జీవ జైలుశిక్షగా మార్చే వీలుంది.

కానీ, సర్బందీ కుటుంబం అందుకు అంగీకరించలేదు. దీంతో శనివారం తెల్లవారుజామున ఉరిశిక్షను అమలుచేశారు. తీర్పు వెలువడిన నాటినుంచి ఆమెకు క్షమాభిక్ష కోసం మానవ హక్కుల సంస్థలు, చివరకు ఐక్యరాజ్యసమితి తమవంతుగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

కాగా, ఆత్మరక్షణ ప్రయత్నంలో జరిగిన హత్యకు ఉరిశిక్ష విధించి ఇరాన్‌ న్యాయవ్యవస్థ తీవ్ర తప్పిదం చేసిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా, సర్బందీ హత్య పథకం ప్రకారమే జరిగిందని అతడి కుటుంబం ఆరోపించింది. సంఘటనకు రెండురోజుల ముందే రెహానే కత్తి కొన్నట్లు అంగీకరించడమే ఇందుకు రుజువుగా పేర్కొంది.

తన తండ్రి హత్యకు గురైన అపార్ట్‌మెంట్‌లో తనతో పాటు మరొక వ్యక్తి ఉన్నట్లు రెహానే విచారణలో చెప్పిందని, ఎంత ఒత్తిడి తెచ్చినా అతడెవరో వెల్లడించలేదని సర్బందీ పెద్ద కుమారుడు జలాల్‌ చెప్పాడు. ఆ నిజం వెల్లడించనందుకే తాము క్షమాభిక్షకు అంగీకరించలేదని పేర్కొన్నాడు.

English summary
A 26 year old Iranian woman convicted of murdering a man she accused of trying to rape her as a teenager was hanged on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X