Iran Israel War: ఇరాన్‌తో భీకర పోరు.. భారత్‌కు ఇజ్రాయెల్ క్షమాపణలు

Iran Israel War: ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య భీకర పోరు నేపథ్యం పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇరాన్ అణు కార్యక్రమాలే లక్ష్యంగా శుక్రవారం ఇజ్రాయెల్ దాడులను ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రతీకారంగా ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరంపై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. ఈ ఉద్రిక్తతల వేళ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చేసిన పోస్ట్ భారతీయులను ఆగ్రహానికి గురి చేసింది. అనంతరం ఐడీఎఫ్ క్షమాపణలు చెప్పింది. భారత పటాన్ని ఐడీఎఫ్ తప్పుగా చూపించింది. జమ్మూకశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా, ఈశాన్య రాష్ట్రాలు నేపాల్‌లో భాగంగా చూపించింది.

ఇరాన్‌లోని టెహ్రాన్‌పై వైమానిక దాడులకు ఐడీఎఫ్ ఎక్స్ ఖాతాలో పోస్టును షేర్ చేసింది. ఆ పోస్టులో "ఇరాన్ ఇజ్రాయెల్ అంతిమ లక్ష్యం కాదు. ఇది ప్రారంభం మాత్రమే. ఆ దేశం ప్రపంచం మొత్తానికి ముప్పే. అందువల్ల మాకు మరో అవకాశం లేదు." అని ఐడీఎఫ్ పేర్కొంది. ఆ పోస్టులో ప్రపంచ పటానికి సంబంధించిన ఫోటోను జత చేసింది. అందులో భారత మ్యాప్‌ను తప్పుగా చూపించడం వివాదాస్పదం అయింది. ఐడీఎఫ్ విడుదల చేసిన మ్యాప్‌పై భారత్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఇజ్రాయెల్ తీరుపై నెటిజన్లు మండిపడ్డారు.

Iran-Israel War IDF Apologizes to India for Incorrect Map Amidst Escalating Tensions

దాడులకు సంబంధించి షేర్ చేసిన మ్యాప్‌లో జమ్మూకశ్మీర్ ను పాకిస్థాన్ భూభాగంలో చూపించడం భారతీయులను ఆగ్రహానికి గురి చేసింది. దీనిపై భారతీయ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పోస్టును వెంటనే ఉపసంహరించుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును పలువురు నెటిజన్లు ట్యాగ్ చేశారు. దీంతో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ స్పందించింది. ఈ తప్పుపై ఐడీఎఫ్ క్షమాపణలు చెప్పింది. ఈ మ్యాప్ సరిహద్దులను చిత్రించడంలో విఫలమైందని.. దీనికి క్షమాపణలు చెబుతున్నట్లు మరో పోస్ట్ షేర్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+