Iran-US War: అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక..! చర్చల వేళ ట్విస్ట్..!

తమ ఓడరేవుల దిగ్బంధనం కొనసాగితే శక్తివంతమైన సాయుధ దళాల ప్రతిచర్యను అమెరికా (US) ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ (Iran) సైన్యం ఇవాళ హెచ్చరికలు చేసింది. సార్వభౌమాధికారం, భూభాగం, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడానికి తమ సాయుధ దళాలు గతంలో కంటే అధిక శక్తిని, సంసిద్ధతను కలిగి ఉన్నాయని, మూడవ బలవంతపు యుద్ధం సమయంలో దేశ సైన్యం ఈ శక్తిని, దాడి సామర్థ్యాన్ని కొంతవరకు అనుభవించిందని తెలిపింది.

US-Iran: ట్రంప్ సీజ్ ఫైర్ వెనుక ? తోసిపుచ్చిన ఇరాన్..!
US-Iran: ట్రంప్ సీజ్ ఫైర్ వెనుక ? తోసిపుచ్చిన ఇరాన్..!

ఈ ప్రాంతంలోని శత్రువుల ప్రవర్తన, కదలికలను పర్యవేక్షిస్తూ, వ్యూహాత్మకమైన హార్ముజ్ జలసంధిని నిర్వహిస్తూ, నియంత్రిస్తూనే, మరో దురాక్రమణ జరిగితే అమెరికన్, ఇజ్రాయెల్ శత్రువులకు మరింత తీవ్రమైన నష్టాన్ని కలిగించడానికి తాము సిద్ధంగా, దృఢ నిశ్చయంతో ఉన్నామని ఇరాన్ తెలిపింది. మరోవైపు అమెరికా సంప్రదింపుల బృందానికి నాయకత్వం వహిస్తారని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ దూతలు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ ఈరోజు పాకిస్థాన్‌కు వెళ్తున్నారు. అయితే వారు ఎప్పుడు చేరుకుంటారనే విషయాన్ని వెల్లడించడానికి అమెరికా నిరాకరించింది.

Iran warns the US of heavier damage if its blockade of ports continues branding the move banditry amp amp piracy Full details inside
భారత్ కు ఇరాన్ బిగ్ షాక్..! నౌకపై దాడి, స్వాధీనం..!
భారత్ కు ఇరాన్ బిగ్ షాక్..! నౌకపై దాడి, స్వాధీనం..!

పాకిస్థాన్‌లో సమావేశాల అనంతరం ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చి ఒమన్, రష్యాలకు వెళ్లనున్నారని గార్డియన్ పత్రిక నివేదించింది. విట్కాఫ్, కుష్నర్‌ల రాక కోసం ఆయన పాకిస్థాన్‌లోనే ఉంటారా లేదా అనేది స్పష్టంగా తెలియరాలేదు. అయితే, ఇరాన్ ఓడరేవులపై అమెరికా నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతోందని పేర్కొంటూ, ఇరాన్ గతంలో ప్రత్యక్ష చర్చలను తోసిపుచ్చింది. అమెరికా ప్రతినిధులు పాకిస్థాన్‌కు వెళుతున్న తరుణంలో, యుద్ధాన్ని ముగించేందుకు అమెరికన్లను కలిసేందుకు తమ అధికారులు ప్రణాళిక వేయడం లేదని ఇరాన్ తెలిపింది. తమ ఆందోళనలను ఒక మధ్యవర్తికి తెలియజేస్తామని టెహ్రాన్ చెప్పినట్లు రాయిటర్స్ నివేదించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+