వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈమెకు ఫుడ్ ఇవ్వలేదు: భారీ భూకంపం తర్వాత ప్రెండ్‌ను లాక్కెళ్లిన ఏడేళ్ల బాలుడు (వీడియో)

ఇరాన్ - ఇరాక్ దేశాల ఉత్తర సరిహద్దుల్లో ఇటీవల భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నాలుగు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు పైన 7.3గా నమోదయింది.

|
Google Oneindia TeluguNews

టెహ్రాన్: ఇరాన్ - ఇరాక్ దేశాల ఉత్తర సరిహద్దుల్లో ఇటీవల భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నాలుగు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు పైన 7.3గా నమోదయింది.

ఈ ఏడాది అత్యధిక ప్రాణనష్టం కలిగించిన భూకంపం

ఈ ఏడాది అత్యధిక ప్రాణనష్టం కలిగించిన భూకంపం

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రాణనష్టం కలిగించిన భూకంపం ఇదే. ఇరాన్‌లోని పర్వత ప్రాంతాల్లో భూకంపం ధాటికి భవనాలు కూలిపోయాయి. వాటి కింద ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. భూకంపం అనంతరం సహాయక చర్యలు చేపట్టారు.

ఓ చిన్నారికి ఆహారం రాకుంటే

ఓ చిన్నారికి ఆహారం రాకుంటే

ఇళ్లు, కూడు, గుడ్డ కోల్పోయిన వారికి వాటిని అందించేందుకు సిబ్బంది రంగంలోకి దిగారు. సిబ్బంది ఎంతోమందికి ఆహారం అందించారు. అయితే ఓ చిన్నారికి ఆహారం ఇవ్వలేదు. ఆమెను తీసుకెళ్లి ఆ బాలుడు సిబ్బందిని అడిగాడు.

ఇంటర్నెట్లో వీడియో హల్‌చల్

ఇంటర్నెట్లో వీడియో హల్‌చల్

ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో, సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆరు ఏడేళ్లు ఉన్న చిన్న పిల్లాడు.. తన కంటే చిన్న వయస్సు ఉన్న తన స్నేహితురాలిని ఆహారం ఇస్తున్న ట్రక్కు వద్దకు తీసుకు వెళ్లాడు. మీరు ఈమెకు ఫుడ్ ఇవ్వలేదని వారికి చెబుతాడు.

వీడియో పోస్ట్ చేసిన ఇరానియన్ జర్నలిస్ట్ పోస్ట్

ఈ మేరకు ప్రముఖ ఇరానియన్ జర్నలిస్ట్ సదేగ్ గోర్భాని ట్విట్టర్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఆ బాలుడు తన చిన్నారి స్నేహితురాలికి.. ఆహారం సరఫరా చేస్తున్న ట్రక్ సిబ్బంది ఫుడ్‌, సోడా ఇచ్చేలా చేస్తాడు.

చిన్నారిని చేతి పట్టుకొని లాక్కెళ్లాడు

చిన్నారిని చేతి పట్టుకొని లాక్కెళ్లాడు

ఆ వీడియోలో సదరు బాలుడు ఆచిన్నపిల్ల చేయి పట్టుకొని లాక్కొని వెళ్తాడు. అమ్మాయిని తీసుకు వచ్చినందుకు ట్రక్కు వద్ద ఆహారం సరఫరా చేస్తున్న ఓ వ్యక్తి అతనికి కూడా ఆహారం ఇచ్చి చెంపలు పట్టుకొని ప్రశంసించినట్లుగా ఉంది.

వేలాదిగా రీట్వీట్లు

వేలాదిగా రీట్వీట్లు

ఈ వీడియో హల్‌చల్ చేస్తోంది. వీడియోకు వేలాదిగా రీట్వీట్‌లు వచ్చాయి. ఇరవై నాలుగు గంటల్లోనే 26వేలకు పైగా రీట్వీట్లు వచ్చాయి. ఈ వీడియో చాలామందిని కదిలించింది.

English summary
In a viral video shared by Iranian journalist Sadegh Ghorbani on Twitter, a precious little boy, maybe 6 or 7 years old, drags his friend to a truck handing out food and soda to survivors of the Iraq-Iran earthquake. According to Ghorbani’s post, the little boy says “you didn’t give her enough food.” The video received over 26,000 retweets in less than 24 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X