Welcome To Hell: అమెరికా బలగాలకు ఇరాన్ సంచలన ఆహ్వానం..!

ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్దం నెల రోజులు పూర్తి చేసుకున్న వేళ సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ యుద్దాన్ని ఎలా ముగించాలో తెలియక ఇబ్బందులు పడుతున్న అమెరికా అధ్యక్షుడు డొ నాల్డ్ ట్రంప్.. తాజాగా 10 వేల మంది సైనికుల్ని (US troops) ఇరాన్ కు పంపాలని నిర్ణయించారు. అసలే ఇరాన్ తో భూతలదాడుల్లో నెగ్గడం కష్టమన్న వాదనల మధ్య ట్రంప్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. దీనిపై ఇరాన్ లో ప్రధాన పత్రిక ఘాటుగా స్పందించింది.

ఇరాన్ నుంచి వెలువడే టెహ్రాన్ టైమ్స్ (tehran times) తమ దేశానికి వస్తున్న అమెరికా బలగాలకు అరుదైన ఆహ్వానం పలికింది. వెల్ కమ్ టూ హెల్ (నరకానికి ఆహ్వానం) అంటూ అమెరికా బలగాల ఫొటోతో టెహ్రాన్ టైమ్స్ ప్రచురించిన ముఖ చిత్రం ఇరాన్ వైఖరికి అద్దం పట్టేలా ఉందన్న చర్చ అంతర్జాతీయంగా జరుగుతోంది. ఇప్పటికే అమెరికా బలగాలు తమ దేశంలో అడుగుపెడితే చాలా విపరిణామాలు చవి చూడాల్సి వస్తుందని అగ్రనాయకులు సైతం హెచ్చరికలు చేస్తున్నారు.

Iran s Vicious Warning Welcome To Hell and Coffin Threat for Potential US Ground Troops

ఇరాన్ గడ్డపై అడుగుపెట్టే ఏ అమెరికా సైనికుడైనా "శవపేటికలో మాత్రమే తిరిగి వెళ్తాడు" అని ఈ కథనంలో టెహ్రాన్ టైమ్స్ పేర్కొంది. మధ్యప్రాచ్యానికి 10,000 మంది వరకు అదనపు సైనికులను పంపే విషయాన్ని అమెరికా పరిశీలిస్తోందని తాజాగా అమెరికా మీడియా కథనాలు ప్రచురించిన నేపథ్యంలో ఈ హెచ్చరిక వెలువడింది. ఈ చర్య ఇరాన్ లోపల భూతల సైనిక చర్యకు వాషింగ్టన్ సిద్ధమవుతోందనే ఊహాగానాలకు ఆజ్యం పోసింది. సంఘర్షణను ముగించే లక్ష్యంతో టెహ్రాన్ వాషింగ్టన్‌తో శాంతి చర్చలలో నిమగ్నమై ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెబుతున్నా.. ఈ సైనిక మోహరింపు వివాదాస్పదంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+