ఇరాక్‌లో ఉగ్రవాదుల మారణహోమం, ఒకే ప్రాంతంలో రెండుసార్లు దాడి, 60 మంది మృతి
ఇరాక్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఒకే ప్రాంతంలో రెండుసార్లు దాడికి దిగారు. నసిరియా ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు అక్కడ ఉన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
నసిరియా: ఇరాక్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఒకే ప్రాంతంలో రెండుసార్లు దాడికి దిగారు. నసిరియా ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు అక్కడ ఉన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
ఈ ఘటన జరిగిన కొద్ది సమయానికి దగ్గర్లోని భద్రతా సిబ్బంది చెక్ పాయింట్ వద్ద కారు బాంబుతో దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 90 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. దాడి కారణంగా ఆ ప్రాంతమంతా ఛిద్రమైన శరీరాలు, రక్తంతో భీతావహంగా మారింది.
మృతుల్లో ఏడుగురు ఇరానీయులు కూడా ఉన్నట్లు ఆ ప్రాంత అధికారి జస్సీమ్ అల్ ఖాలిది తెలిపారు. ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటి వరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. కానీ ఇవి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దుశ్చర్యలుగానే భావిస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications