వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంగురంగుల ఆహార పదార్థాలు తింటే ఒంటికి మంచిదా? ఎందుకు, ఎలా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రంగుల్లో కనిపించే ఆహారపదార్ధాలతో పోషకాలు ఎక్కువ

తినే విషయంలో చాలామందికి ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది. నచ్చిన ఆహారం తినాలా లేక ఆరోగ్యానికి పనికొచ్చేది తినాలా అన్నదే ఆ సమస్య. చివరకు చాలామంది ఆరోగ్యానికి మేలు చేసే ఆహారానికే మొగ్గు చూపుతారు.

కానీ మనకు కనిపించే ఆహారంలో ఏది మంచిదన్నది తెలుసుకోవడం ఇక్కడ మరో పెద్ద సమస్య. ఎందులో పోషకాలుంటాయి? ఎందులో ఉండవన్నది మరో సందేహం.

మన డైట్‌లో మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవాలని, ఇందుకోసం రంగురంగులతో ఉన్న ఆహారం మంచిదని చాలామంది పరిశోధకులు నిర్ధరించారు. కానీ, నిజంగా రంగురంగుల ఆహారం తీసుకుంటే మంచి పోషకాలు అందుతాయా?

దీనికి ఉదాహరణ మెడిటేరియన్ డైట్. ఇందులో పండ్లు, కూరగాయలు, ఆలివ్ ఆయిల్ వంటివి ఎక్కువగా కనిపిస్తాయి. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలుంటాయి. సైంటిస్టులు కూడా దీన్ని మంచి ఆహారంగా చెబుతుంటారు.

అంటే దానర్థం రంగురంగుల పాకెట్లలో పెట్టిన ఆహారం తీసుకోవడం కాదంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ ఫ్లారెన్స్‌లో క్లినికల్ న్యూట్రిషన్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఫ్రాన్సెస్కో సోఫి.

''రంగుల్లో కనిపించే ప్రతి ఆహారం మంచిదని కాదు. ఇది సీజన్‌ను బట్టి ఉంటుంది. మంచి ఆహారం తీసుకోవాలనుకునే వారు సీజనల్‌గా వచ్చే రకరకాల కూరగాయలను తమ ఆహారంలో చేర్చుకుంటారు'' అన్నారు సోఫీ.

మెడిటేరియన్ డైట్‌లో ఏముంటుంది?

అయితే, మరి శాకాహారులు తినేవి కూడా రంగురంగుల కూరగాయలే కదా? ''మెడిటేరియన్ డైట్‌కు, శాకాహార వంటకాలకు తేడా ఏంటంటే మెడిటేరియన్లు తమ వంటలను ఉడకబెడతారు. కానీ, సాధారణ శాకాహారులు ఫ్రై చేస్తారు. ఉడకబెట్టడం వల్ల పోషకాల నష్టం ఉండదు'' అన్నారు ఫ్రాన్సెస్కో సోఫి.

అలాగే ఆహారంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం మర్చిపోవద్దు. గుండెకు, మెదడుకు మేలు చేసే అనేక పోషకాలు పండ్లు, కూరగాయల్లో ఉంటాయని సైన్స్ చెబుతోంది.

ఈ విషయంలో జరిగిన అనేక ప్రయోగాలు దీన్ని నిర్ధరించాయని అమెరికాలోని ఒరెగాన్‌‌లో ఉన్న యూనివర్శిటీ ఆఫ్ వెస్ట్రన్ స్టేట్స్‌కు చెందిన పోషకాహార నిపుణులు డీనా మినిచ్ వెల్లడించారు.

''రంగురంగుల ఆహార పదార్థాల్లో మంచి పోషకాలుంటాయి. మనం ఈ ఇంద్రధనస్సు రంగులను మిస్సయితే మంచి ఆరోగ్యాన్ని కూడా మిస్సవుతున్నట్లే'' అన్నారు మినిచ్.

కడుపులో, శరీరంలో మంటను తగ్గించే ప్రోటోన్యూట్రియెంట్స్‌, కారోటెనాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్‌ ఉంటాయి. ఒక్కో రంగు మొక్క నుంచి ఇలాంటి ఒక్కో పోషకం లభిస్తుంది.

బ్లూబెర్రీస్‌తో పాటు, నీలం, ఊదా రంగు ఆహారాలలో మొక్కల వర్ణద్రవ్యం(పిగ్మెంట్) ఆంథోసైనిన్ అధికంగా ఉంటుంది. ఇది గుండె జబ్బులు, టైప్-2 డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆహారంలోని పసుపు రంగు ఇచ్చే ఫ్లేవోన్స్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

''కొన్ని మొక్కలకు చెందిన రంగులు మన శరీరంలోని వివిధ భాగాలకు చేరుకుంటాయి'' అన్నారు మినిచ్.

"ఉదాహరణకు, లుటీన్ అనేది వివిధ రకాల పసుపు, ఆకుపచ్చ ఆహారాలలో కనిపిస్తుంది. ఇది కంటి వెనుక భాగంలో ఉండే మాక్యులా అనే ప్రాంతానికి చేరుతుంది. ఇది మాక్యులర్ డీజెనరేషన్ అనే సమస్య రాకుండా కాపాడుతుంది'' అన్నారు మినిచ్.

ప్లేవనాయిడ్స్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయని, మెదడు నరాలలో చేరే విషాలను ఇది నివారిస్తుందని చెబుతారు. ఈ విషాలు అల్జీమర్స్‌కు దారి తీస్తాయని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.

పండ్లతోపాటు రంగుల్లో కనిపించే ఆకుకూరలు కూడా మంచివేనని పరిశోధనలు చెబుతున్నాయి.

పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

ఈ డైట్లు తీసుకున్న 50,000 మందిని 20 సంవత్సరాల పాటు పరిశీలించినప్పుడు ఫ్లేవనాయిడ్స్‌ అధికంగా ఉన్న నారింజ, ద్రాక్ష, మిరియాలులాంటివి ఎక్కువగా ఉన్న ఆహారాలను తిన్న వారిలో జ్ఞాపకశక్తి క్షీణత, మతిమరుపులాంటి సమస్యలు చాలా తక్కువగా ఉన్నట్లు హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో పరిశోధనలు చేస్తున్న టియా షిన్ యే వెల్లడించారు.

మనం ఇంతవరకు ఇలాంటి ఆహారాలు తీసుకోకపోతే ఇప్పటికైనా మించిపోయింది లేదంటారు టియా షిన్.

రంగురంగుల ఆహారం తినడం వల్ల ఒకే ఆహారాన్ని అతిగా తినడం అనే సమస్య నుంచి కూడా బైటపడవచ్చని టియా షిన్ అన్నారు.

అయితే ఇలాంటి ఆహారాలను తీసుకోవడం అంత సులభం కూడా కాదంటున్నారు బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్‌కు చెందిన సీనియర్ డైటీషియన్ విక్టోరియా టేలర్.

''రోజూ అదే తరహా ఆహారం సేకరించి తినడం కూడా కష్టమే. కాబట్టి అవే పోషక విలువలున్న ప్రత్యామ్నాయాలను కూడా సిద్ధం చేసుకోవాలి'' అన్నారు టేలర్.

అయితే, రంగురంగుల ఆహారం అంటే కేవలం పళ్లు, కూరగాయలు మాత్రమే కాదని, రంగురంగుల ఆకుకూరలు, దినుసులు, పప్పులు, విత్తనాలు, ధాన్యాలు, చివరకు టీ కూడా ఈ కోవలోకే వస్తుందని మినిచ్ అన్నారు.

ఎక్కువ తిన్నా ప్రమాదమేనా?

రెయిన్‌బో ఫుడ్‌లో తెలుపు రంగు ఆహారాన్ని కూడా విస్మరించలేమని, టోఫులాంటి పదార్థాలలో రకరకాల ఐసోఫ్లేవన్‌లు ఉంటాయని, ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్, జ్జాపకశక్తి సమస్యలను నివారిస్తాయని మినిచ్ అన్నారు.

రకరకాల రంగుల పళ్లను తినడమంటే పోషకాలను ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించడమేనని, ఒక ప్లేట్‌లో ఒకటే రకం పండ్లు ఉంచితే, ఒకటి రెండు తిని ఆపేస్తామని, అదే రకరకాల ఫ్రూట్స్ ఉంటే ఎక్కువ తింటామని, తద్వారా ఎక్కువ పోషకాలు శరీరంలోకి చేరతాయని స్వాన్‌సీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న రాషెల్లీ ఎంబ్లింగ్ అన్నారు.

ఇక్కడ రంగురంగుల ఆహారాలను తీసుకోవడంలో ఒక సమస్య కూడా ఉందని సైంటిస్టులు అంటున్నారు. రంగు రంగుల పదార్ధాలతో కొన్ని చెడ్డవి కూడా ఉంటాయని, వీటిని అధికంగా తీసుకోవడం ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని రాషెల్లీ అన్నారు.

ఇక కృత్రిమ రంగులు కలిపే ఆహారాలను మంచి ఆహారంగా భావించరాదని ఆమె అన్నారు.

రంగులతో సంబంధం లేకుండా మంచి ఆహారం తీసుకునేందుకు మరికొన్ని విధానాలున్నాయని కూడా పరిశోధకులు చెబుతున్నారు. అధిక రుచి అంటే పులుపు, చేదు, కారంలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా కొంత మేలు జరుగుతుందని చెబుతున్నారు.

ఉదాహరణకు చేదు ఎక్కువగా ఉండే పదార్థాలను వరసగా 12 వారాలపాటు తీసుకున్నప్పుడు వాటిలోని పోషకాలు, ఫైబర్‌లు రక్తపోటును తగ్గిస్తాయని తేలింది.

ఇక రంగులతో పాటు మనం తీసుకునే కూరగాయలు, పళ్లలో ఏ ప్రాంతం ఎక్కువ ఆరోగ్యకరమైనదన్నది తెలుసుకుని ఉండటం వల్ల ప్రయోజనం ఉంటుందని టియ షిన్ అన్నారు. దీనికన్నా రంగురంగులున్న వాటిని సేకరించడం చాలా సులభమని పరిశోధకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Is it good to eat colorful foods
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X