వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ భూకంపంతో ఎత్తు తగ్గిందా?: ఎవరెస్ట్‌ను మళ్లీ కొలవనున్నారు

ఎవరెస్టు పర్వతాన్ని మరోసారి కొలవనున్నారు. మూడు నెలల్లో దీని ఎత్తు ఇప్పుడు ఎంత ఉందో నిర్ధారించనున్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎవరెస్టు పర్వతాన్ని మరోసారి కొలవనున్నారు. మూడు నెలల్లో దీని ఎత్తు ఇప్పుడు ఎంత ఉందో నిర్ధారించనున్నారు. ఎవరెస్ట్ ఎత్తును కొలవడానికి జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సిద్ధమైంది.

దీనిని మరో రెండు నెలల్లో ప్రారంభించనున్నట్లు సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా డాక్టర్‌ స్వర్ణ సుబ్బారావు తెలిపారు. ఎత్తును కొలవడానికి సుమారు నెల రోజులు సమయం తీసుకునే అవకాశముందన్నారు.

<strong>డేంజరెస్ గేమ్ : పులికి ముచ్చెమటలు పట్టించిన బాతు</strong>డేంజరెస్ గేమ్ : పులికి ముచ్చెమటలు పట్టించిన బాతు

Is Mt Everest Shorter Now? Survey of India to 'Re-measure'

హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఎవరెస్ట్.. 8,848 మీటర్లతో ప్రపంచంలోనే ఎత్తైన శిఖరంగా ఉంది. నేపాల్‌లో రెండేళ్ల క్రితం సంభవించిన తీవ్ర భూకంప నేపథ్యంలో ఎవరెస్ట్‌ ఎత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నేపాల్లో వచ్చిన భూకంపం కారణంగా టెక్టానిక్ పలకల్లో మార్పులు వచ్చి, ఎవరెస్ట్ ఎత్తుపై ప్రభావం చూపి ఉంటుందనే వాదన ఉంది.

దీంతో ఎవరెస్ట్ ఒక అంగుళం మేర తగ్గి ఉంటుందని కొంతమంది శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది చర్చనీయాంగా మారింది. ఈ నేపథ్యంలో ఎవరెస్ట్‌ ఎత్తును కొలిచే బాధ్యతను జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తీసుకుంది.

English summary
The Survey of India would soon "re-measure" the height of Mount Everest to verify doubts expressed over it in some sections of the scientific community following the major earthquake in Nepal two years ago and to help scientific studies, Surveyor General of India Swarna Subba Rao said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X