వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకే వ్యక్తికి రెండోసారి కరోనా సోకుతుందా..? వస్తే ఆరోగ్య పరిస్థితి ఏంటి..? అక్కడ ఏం జరిగింది..?

|
Google Oneindia TeluguNews

కరోనావైరస్ ఒక్కసారి సోకితే మళ్లీ సోకదా..? కరోనావైరస్ మళ్లీ సోకదు అనేది అపోహ మాత్రమేనా.. అనే ప్రశ్నలకు వాస్తవ పరిస్థితులే సమాధానంగా నిలుస్తున్నాయి. కరోనావైరస్ ఒకసారి సోకిన వ్యక్తికి మళ్లీ సోకదు అనేది అపోహ మాత్రమే అని భావించాల్సి ఉంది. ఎందుకంటే హాంగ్‌ కాంగ్, ఐరోపా దేశాల్లో ఒక వ్యక్తికి సోకిన కరోనావైరస్ తగ్గిపోయి తిరిగి సోకిందన్న వార్తలు వచ్చాయి. తాజాగా అమెరికాలో కూడా ఇన్‌ఫెక్షన్ తిరిగి అదే వ్యక్తులకు సోకుతోందన్న విషయం ఆందోళనకు దారితీస్తోంది.

రెనోకు చెందిన 25 ఏళ్ల యువకుడికి కరోనావైరస్ లక్షణాలు కనిపించాయి. పరీక్షలు నిర్వహించగా కరోనావైరస్ పాజిటివ్ అని ఈ ఏడాది ఏప్రిల్‌‌లో తేలింది. ఆ తర్వాత రెండు సార్లు నెగిటివ్‌గా వచ్చింది. ఇక తిరిగి జూన్‌లో పాజిటివ్‌ వచ్చింది. రెండోసారి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది . ఆ యువకుడు న్యుమోనియాతో బాధపడుతూ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు. అంతేకాదు ప్రస్తుతం ఆక్సిజన్ అందిస్తూ ఆ వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

Is there a chance that Covid-19 can reinfect the same person? US man suffers for the second time

జన్యుపరీక్షలు చేయగా వైరస్ యొక్క లక్షణాలు సారూప్యత కలిగి ఉన్నాయని అయితే కనీసం 12 ప్రాంతాల్లో కాస్త తేడా ఉన్నట్లు గమనించినట్లు వైద్యులు చెప్పారు.ఇక ఆ వ్యక్తి తన తల్లిదండ్రులతో నివాసం ఉంటుండగా వారిలో ఒకరికి జూన్‌లో కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. అయితే అక్కడి నుంచి కొత్త ఇన్ఫెక్షన్ సోకి ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే దీనికి సంబంధించిన పరిశోధనలను అధికారికంగా ప్రకటించలేదు కానీ ఓ రీసెర్చ్ సైట్‌ పై పోస్టు చేయడం జరిగింది.

Recommended Video

COVID-19 : India Crosses 34 Lakh Mark సెప్టెంబర్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు : జార్ఖండ్ || Oneindia

ఇక ఈ కేసును బట్టి వైరస్ రెండో సారి రాదని అనుకోవడం అపోహే అవుతుందని వైద్యులు చెబుతున్నారు. అదే సమయంలో రెండో సారి కనక కరోనా వైరస్ సోకితే అది ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుందని ముఖ్యంగా శ్వాసకోశ వ్యవస్థపై ఆ ప్రభావం అధికంగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

English summary
Nevada officials are reporting what may be the first documented case of coronavirus reinfection in the United States, following similar reports earlier this week from Hong Kong and Europe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X