పొరపాటు: క్షిపణి దాడి జరగొచ్చు, భయంతో పరుగులు తీశారు. ఏమైందంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

హవాయి: ఓ చిన్న పొరపాటు ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. అణు క్షిపణి దాడి జరిగే ప్రమాదం ఉందనే ప్రచారం జరగడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే ఎట్టకేలకు ఈ విషయాన్ని గమనించిన అధికారులు ప్రజలకు అసలు విషయాన్ని చేరవేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకొన్నారు.

బాత్‌రూమ్‌లో ఉండగా అగ్ని ప్రమాదం: చైనా జంట సెల్పీల పిచ్చి

హవాయిలో ప్రజలను అప్రమత్తం చేసే అధికారుల్లో ఒకరు తప్పుడు సమాచారం ఇవ్వడంతో ప్రజలంతా తీవ్ర గందరగోళానికి గురయ్యారు. హవాయిపైకి ఏక్షణంలోనైనా క్షిపణి దూసుకురావొచ్చని, దీన్ని డ్రిల్‌ అనుకొని తేలిగ్గా తీసి పారేయకూడదని, అంతా అప్రమత్తంగా ఉండాలని ఆ సందేశం సారాంశం.

'Is This The End Of My Life?': False Missile Alert Sends Hawaii Scrambling

దాదాపు అన్ని మొబైల్‌ఫోన్‌లకు ఆ సందేశం పోయింది. దాంతో వెనుకాముందు ఆలోచించకుండా జనాలు తమ బంధువులకు ఫోన్‌లు చేసుకున్నారు.సమాచారం చాలా విలువైనది .అందరినీ అప్రమత్తం చేసుకొని వీలయిన చోట్లల్లో దాచుకొని ఎప్పుడు క్షిపణి పడుతుందోనని భయంతో బెంబేలెత్తిపోయారు.

బాలిస్టిక్‌ అణు క్షిపణి హవాయి మీదకు దూసుకొస్తుంది'అంటూ ఉదయం 8.07గంటల ప్రాంతంలో అలర్ట్‌ వచ్చింది. దీంతో అంతా అప్రమత్తమయ్యారు. అడమ్‌ కుర్జ్‌ అనే వ్యక్తి తన అనుభవాన్ని చెబుతూ నేను మిసైల్‌ అలర్ట్‌ వచ్చిన నాలుగు నిమిషాల తర్వాత నిద్ర లేచాను. అంతా పరుగులు పెడుతున్నారు. మాకు ఏం చేయాలో తోచలేదు. మా సాధు జంతువులను తీసుకొని వెంటనే వెళ్లి బాత్‌ రూంలో భద్రంగా ఉండొచ్చిని దాక్కున్నామని చెప్పారు.

అయితే, డేవిడ్‌ ఐజ్‌ డీ అనే ప్రభుత్వ అధికారి ఈ సమాచారం తప్పని ధ్రువీకరించారు. ఎమర్జెన్సీ విభాగంలో పనిచేస్తున్న అధికారులు తమ షిప్ట్‌ మారే సమయంలో పొరపాటున రాంగ్‌ బటన్‌ నొక్కడంతో అందరికీ తప్పుడు సమాచారం వెళ్లినట్లు తెలిపారు. మున్ముందు అలాంటివి జరగకుండా చూసుకుంటామని అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
For 38 harrowing minutes, residents and tourists in Hawaii were left to believe that missiles were streaming across the sky toward the Pacific island chain after an erroneous alert Saturday morning by the state's emergency management agency.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X