ఇస్లాం స్వీకరించలేదని నలుగురు చిన్నారుల తలలు నరికిన ఐఎస్ ఉగ్రవాదులు
బాగ్దాద్: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి తమ క్రూరత్వాన్ని ప్రదర్శించారు. ఇస్లాం మతంలోకి మారేందుకు నిరాకరించిన కారణంగా నలుగురు క్రిస్టియన్ చిన్నారుల తలనరికేశారు. ఈ ఘటన ఇరాక్ రాజధాని బాగ్దాద్ సమీపంలో జరిగింది.
క్రిస్టియన్ మతస్తులను ఇరాక్ నుంచి తరిమికొట్టాలన్నదే ఐఎస్ఐఎస్ ఉద్దేశమని, ఉగ్రవాదులు నిర్దయగా వ్యవహరించారని ఆ ప్రాంత క్రిస్టియన్ నేత కేనన్ ఆండ్రూ వైట్ తెలిపారు. ఉగ్రవాదులు ఇప్పటికే వందలాది మందిని హతమార్చారని ఆయన అన్నారు. పెద్దలు మతం మారకుంటే వారి పిల్లలను చంపుతున్నారని ఆరోపించారు.

ఇతర మతస్తులు ఇరాక్‌లో ఉండే పరిస్థితి లేకుండా పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాగ్దాద్‌లో పరిస్థితి మరింత ఆందోళన కరంగా ఉందని చెప్పారు. ఎప్పుడూ బాంబుల దాడులు, కాల్పులు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. ఉగ్రవాదుల దాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు.
చాలా మంది ప్రజలు తమ సొంత దేశాలకు తరలివెళ్లిపోతున్నారని చెప్పారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు రాకముందు ఇక్కడ ప్రశాంతంగానే ఉండేదని తెలిపారు. ఉగ్రవాదులు చాలా మంది హత్య చేశారని, తమ పిల్లల తలలు నరికివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మతం మారకుంటే చావక తప్పదని వారు బెదిరింపులకు గురిచేస్తున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications