వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమ్మల్ని భయపెట్టలేరు: కాలిఫోర్నియా ఘటనపై ఒబామా

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉగ్రవాదులు అమెరికన్లలో భయాన్ని పెంచలేరని ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. కాలిఫోర్నియాలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంగా తన వారాంతపు ప్రసంగం చేసిన ఒబామా, ఉగ్రవాదులు తమ ఉనికిని చాటుకొనే క్రమంలోనే కాలిఫోర్నియాలో తెగబడ్డారని తెలిపారు.

ఎక్కడ ఏ రూపంలో ఉగ్రవాదం దాగున్నా, దాన్ని అంతమొందించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. "మేము అమెరికన్లం. మేము బలవంతులం. మా స్వేచ్ఛను మేము కాపాడుకుంటాం. మమ్మల్ని భయపెట్టలేరు" అని ఆయన అన్నారు. దేశంలో తుపాకీ నియంత్రణ చర్యలను మరింత పటిష్టం చేయాలని మరోమారు ఆదేశించారు.

ఐఎస్‌తోపాటు ఇతర ఉగ్రవాద గ్రూపులు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను హింసకు ప్రేరేపిస్తున్నాయని ఒబామా పేర్కొన్నారు. ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాన్ బెర్నాండినోలో ఓ సామాజిక సేవా కేంద్రంపై దాడి చేసి 14 మందిని హతమార్చిన దంపతులు తమ అనుచరులేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఆన్‌లైన్ రేడియోలో ప్రకటించింది.

ISIS Praises San Bernardino Attackers; 'We Will Not Be Terrorized,' Obama Says

ఈ నెల రెండో తేదీన భార్యాభర్తలు ఓ హాలిడేపార్టీపై విరుచుకుపడి విచక్షణారహితంగా కాల్పులు జరిపడంతో వీరంతా ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆ ఇద్దరిని కాల్చి చంపారు. వీరిని తష్ఫీన్ మాలిక్, సయ్యద్ రిజ్వాన్ ఫరూక్‌లుగా గుర్తించారు.

కాగా, కాలిఫోర్నియాపై దాడి చేసిన పాక్ దంపతులను పొగడుతూ, ఐఎస్ఐఎస్ సొంత రేడియో ప్రత్యేక వార్తలను ప్రసారం చేసింది. వారు ఇస్లామిక్ రాజ్యం కోసం మరణించి దేవుడిని చేరిన గొప్పవారని ఉగ్రవాద సంస్థ వ్యాఖ్యానించింది. ఈ దంపతులు తమ సభ్యులేనని ఐఎస్ రేడియో వెల్లడించింది. ఆ దాడికి, ఐఎస్‌కు ఉన్న సంబంధంపై వారు ట్వీట్ చేశారు.

కానీ అమెరికా ప్రభుత్వ వర్గాలు మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. ఉగ్రవాద సంస్థ ఆదేశానుసారమే దాడి జరిగిందనడానికి ఆధారాలు లేవని అవి అంటున్నాయి. కనీసం ఐఎస్ సంస్థకు ఆ దంపతులెవరో తెలిసినట్టు కూడా సాక్ష్యాలు లేవని తెలిపాయి.

English summary
After news emerged Friday that the female shooter in a deadly attack in California had pledged allegiance to ISIS, the extremist group issued a radio bulletin calling Tashfeen Malik and her husband Syed Rizwan Farook "supporters." The group did not claim to have planned or ordered the attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X