న్యూయార్క్‌ను పేల్చేస్తాం: ఐసిస్ వీడియో హెచ్చరిక
వాషింగ్టన్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో దారుణ మారణకాండ సృష్టించిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అగ్రరాజ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. తాజాగా ఐసిస్ ఓ వీడియో విడుదల చేసింది. అందులో న్యూయార్క్ నగరాన్ని పేల్చేస్తామని హెచ్చరించింది.
న్యూయార్క్‌లో దాడులు చేస్తామని ఐసిస్ ఇంటర్నెట్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఉగ్రవాదుల బెదిరింపు నేపథ్యంలో న్యూయార్క్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

బందీలను హతమార్చిన ఐసిస్
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దుశ్చర్చలు కొనసాగుతున్నాయి. తన వద్ద బందీలుగా ఉన్న చైనా దేశస్తుఢు ఫాన్ జిన్ హుయి, నార్వే దేశస్థుడు ఒలె జోహాన్ గ్రిమ్స్ గార్డ్‌లను హత్య చేశారు. వారిద్దరూ, కాఫిఱ్ దేశాలు, సంస్థలకు చెందిన వారు కాబట్టే మరణశిక్ష విధఇంచామని పేర్కొంది.
భారత్‌లో 150 మంది యువత ఐసిస్ వైపు మొగ్గు
భారత్‌లో దాదాపు 150 మంది యువత భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ వైపు ఆకర్షితులైనట్లు ఇంటెలిజెన్స్ నివేదికలో వెలుగులోకి వచ్చింది. వారిపై భద్రతా సంస్థలు పటిష్ఠమైన నిఘా వేశాయి.
ముఖ్యంగా దక్షిణ భారత దేశ యువత ఎక్కువగా ఈ ఉగ్రవాద సంస్థ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఐసిస్ ఉగ్రవాదికి సందేశాలు పంపాడంటూ ఆరోపణలు ఎదుర్కొన్న, అక్రమ ఆయుధాలు కలిగివున్నందుకు అరెస్ట్ చేసిన హైదరాబాద్ వ్యక్తి మహమ్మద్ రెహమత్ పాషాకు దిల్లీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications