మిలిటెంట్‌తో పెళ్లికి నో చెప్పిన యువతిని..: ఐసిస్ ఘాతుకం
ఇరాక్: ఐసిస్ ఉగ్రవాదుల ఘాతుకాలకు హద్దే లేకుండా పోతోంది. తాజాగా మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. మిలిటెంట్‌ను పెళ్లి చేసుకోనందుకు ఓ మహిళను అతి దారుణంగా రాళ్లతో కొట్టి చంపారు. చనిపోయిన మహిళ ఇరాక్‌కు చెందినది.
ఐసిస్ ఆధీనంలో ఉన్న ఇరాక్‌లోని మోసూల్ ప్రాంతంలో ఉగ్రవాదుల అరాచకాలు దారుణంగా ఉన్నాయి. మహిళలపై వారు దారుణాలకు పాల్పడుతున్నారు. నగరంలో 32 ఏళ్ల మహిళను ఒక ఇస్లామిక్ ఉగ్రవాది వివాహం చేసుకోవాలని కోరాడు. ఇందుకు మహిళ తల్లిదండ్రులు అంగీకరించారు.

కానీ మహిళ అందుకు నో చెప్పింది. దీంతో ఆగ్రహం చెందిన ఐసిస్ ఉగ్రవాదులు ఆమె వ్యభిచారానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ షరియత్ కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు రాళ్లతో కొట్టి చంపాలని కోర్టు తీర్పు చెప్పింది. తీర్పు అనంతరం ఐసిస్ ఉగ్రవాదులు నగర ప్రజలను బయటకు తీసుకు వచ్చి.. వారి ముందు ఆమెను రాళ్లతో కొట్టి చంపేశారు.












Click it and Unblock the Notifications