వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

130 మందిని చంపింది వీరే: ఐసిస్ టార్గెట్ బ్రిటన్

|
Google Oneindia TeluguNews

లెబనాన్ /బీరట్: పారిస్ లో నరమేధానికి పాల్పడి 130 మందిని పొట్టన పెట్టుకున్న తొమ్మిది మంది ఉగ్రవాదులు వీరేనంటూ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) సంస్థ ఓ వీడియో విడుదల చేసింది.

పారిస్ లో దాడులకు పాల్పడిన తొమ్మిదిమందిలో నలుగురు బెల్జియన్లు, ముగ్గురు ఫ్రాన్స్ పౌరులు, ఇద్దరు ఇరాకీలు ఉన్నారని తమ వెబ్ సైట్ లో పోస్టు చేసిన వీడియోలో పేర్కొంది. వాళ్లు ఎక్కడ కనిపిస్టే అక్కడే చంపండి అనే పేరిట వీడియో విడుదల చేశారు.

వీడియోలో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దేశాలకు ఐఎస్ఐఎస్ తీవ్ర హెచ్చరికలు చేసింది. సంకీర్ణ కూటమిలో భాగంగా ఉన్న బ్రిటన్ తమ తదుపరి లక్షం అంటూ పరోక్షంగా హెచ్చరించి సంకేతాలు ఇచ్చింది.

ISIS video threatening UK claims to show paris attackers in Syria

2014 సెప్టెంబర్ నుంచి సిరియా, ఇరాక్ లో ఐఎస్ఐఎస్ ఫైటర్లపై వైమానిక దాడులు చేస్తున్న అమెరికా నేతృత్వంలోని అన్ని దేశాలకు ఈ సందేశం వర్తిస్తుందని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఫ్రెంచ్, అరబ్ బాషల్లో హెచ్చరించారు.

బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ ఫొటో అందులో చూపించారు. ఫోటోతో పాటు అవిశ్వాసులుతో జతకలిసే ప్రతి ఒక్కరూ మా తల్వార్లకు లక్ష్యం కావాల్సిందే అని ఇంగ్లీష్ లో హెచ్చరించారు. పారిస్ దాడిలో ఫ్రాన్స్ ను గడగడలాండిచిన తొమ్మిది మంది సింహాలు అంటూ వీడియోలో పొగిడారు.

పారిస్ దాడులకు ముందు ఆ తొమ్మిది మంది ఉగ్రవాదులు తమకు చిక్కిన నిస్సహాయుల తలలు నరుకుతున్నదృశ్యాలు వీడియోలో పెట్టారు. ఐఎస్ఐఎస్ మీడియా కేంద్రం అయిన అల్ హయత్ లో ఈ వీడియో విడుల చేశారు, పారిస్ దాడుల ఫోటోలు అందులో పొస్టు చేశారు.

English summary
If the identities of the men in the video are confirmed, it would indicate that the nine were not only influenced by ISIS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X