సిరియాపై ఇజ్రాయెల్ యుద్ధం.. మిలిటరీ హెడ్ క్వార్టర్స్, అధ్యక్ష భవనం ధ్వంసం
సిరియాపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ రాజధాని డమాస్కస్ లోని మిలిటరీ స్థావరాలు, అధికారుల భవనాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తోంది. డమాస్కస్ లోని మిలిటరీ కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో మిలిటరీ హెడ్ క్వార్టర్స్ భవనం ధ్వంసం అయింది. అందుకు సంబంధించిన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

సిరియాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. సిరియా రాజధాని డమాస్కస్ లోని మిలిటరీ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేపట్టింది. బాంబుల వర్షానికి డమాస్కస్ లోని మిలిటరీ ప్రధాన కార్యాలయం ధ్వంసం అయింది. ఒకరు మృతి చెందారు. సిరియాలోని మిలిటరీ సామాగ్రి పూర్తిగా ధ్వంసం అయింది. సిరియాలోని డ్రూజ్ ప్రజలను కాపాడేందుకే దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అలాగే సిరియాలోని అధ్యక్ష భవనం లక్ష్యంగా దాడులు చేసినట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. దీనికితోడు అధ్యక్ష భవనం వద్ద దాడుల శబ్దం, పొగ వాసనలు గుర్తించినట్లు స్థానికులు పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ ఏకధాటిగా చేస్తున్న దాడులకు ఒకరు మృతి చెందగా 18 మంది గాయపడ్డట్లు సిరియాలోని వైద్య శాఖ తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్.. గాజా నుంచి తమ సైన్యాన్ని సిరియా సరిహద్దుకు మోహరిస్తోంది. దీంతో భీకర దాడులు తప్పేలా లేదు. తాజాగా రాజధాని డమాస్కస్ లోని ప్రభుత్వ టీవీ బిల్డింగ్ కార్యాలయం లక్ష్యంగా దాడులు చేస్తోంది ఇజ్రాయెల్ సైన్యం. ఈ దాడులు లైవ్ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ దాడులతో భయపడిన ఓ టీవీ యాంకర్ లైవ్ లో న్యూస్ చదవడం ఆపేసి బయటకు పరుగులు తీసింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
Huge explosions were seen in Damascus as Israel bombed Syria’s defence ministry during a live Al Jazeera broadcast nearby. pic.twitter.com/Fe7N6xH02I
— Al Jazeera English (@AJEnglish) July 16, 2025
దక్షిణ సిరియాలోని సువీడా ప్రాంతంలో మైనారిటీ వర్గం అయిన డ్రూజ్ తెగ ప్రజలకు, సైన్యానికి మధ్య వివాదం చెలరేగింది. దీంతో వీరి మధ్యలోకి ఇజ్రాయెల్ ప్రవేశించింది. డ్రూజ్ వర్గం ప్రజలకు మద్దతుగా సిరియా ప్రభుత్వం పై దాడులు చేస్తోంది. ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ మంత్రి ఖట్జ్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ సైన్యానికి ఇచ్చిన వార్నింగ్ ముగిసింది.. ఇక దాడులను తట్టుకోండి అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ సైన్యం సిరియాపై దాడులు కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఇజ్రాయెల్ లోని డ్రూజ్ తెగ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సిరియాలోని డ్రూజ్ తెగ ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం రక్షిస్తుందని హామీ ఇచ్చారు ఖట్జ్.
BREAKING: Israel targeted the Presidential palace and the Syrian General Staff building in Damascus.
— ADAM (@AdameMedia) July 16, 2025
Israel is officially at war with Syria.
Source: Israeli Channel 12
pic.twitter.com/iTtM0VyDOc
ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కీలక వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ లోని డ్రూజ్ వర్గం ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ సరిహద్దు దాటి సిరియాలోకి ప్రవేశించవద్దని.. సువీడా ప్రాంతంలో ఉద్రిక్తతలు అధికమయ్యాయని పేర్కొన్నారు. మరోవైపు ఇజ్రాయెల్- సిరియా యుద్ధంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య చర్చలు జరుపుతున్నట్లు శ్వేతసౌథం ప్రకటనలో పేర్కొంది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications