Israel Yemen War: ఆపరేషన్ బ్లాక్ ఫ్లాగ్.. యెమెన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్
Israel Yemen War: ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య శాంతి నెలకొన్నప్పటికీ.. ఇజ్రాయెల్ ఇప్పుడు మరో కొత్త దేశంపై దాడి చేసింది. ఇజ్రాయెల్ దాడి చేసిన ఆ దేశం యెమెన్. ఇజ్రాయెల్ యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుంది. దీని కారణంగా మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. "ఆపరేషన్ బ్లాక్ ఫ్లాగ్" ద్వారా ఇజ్రాయెల్ యెమెన్ పశ్చిమ భాగంలో ఉన్న మూడు ప్రధాన నౌకాశ్రయాలపై దాడి చేసింది. ఇజ్రాయెల్ వైమానిక దళం యెమెన్‌లోని హౌతీ నియంత్రణలోని హుదైదా, రాస్ ఈసా, సైఫ్ ఓడరేవులపై భారీ వైమానిక దాడులు చేసింది. హౌతీల మిస్సైల్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఈ దాడి చేసింది. అంతకు ముందు ఇజ్రాయెల్ ఇరాన్ అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే.
దాడికి ముందు ఇజ్రాయెల్ యెమెన్‌లోని హుదైదా, రాస్ ఈసా, సైఫ్ ప్రాంతాల పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆ ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లమని సూచించింది. ఇజ్రాయెల్ వైమానిక దళం ఎప్పుడైనా దాడి చేయవచ్చని వారికి తెలిపారు. హెచ్చరికలు జారీ చేసిన కొన్ని గంటల్లోనే వైమానిక దాడులు ప్రారంభమయ్యాయి. గాజాలోని పాలస్తీనియన్లకు మద్దతుగా హౌతీలు ఇజ్రాయెల్ పై మిస్సైల్ దాడులకు దిగారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ హౌతీ స్థావరాలపై గురిపెట్టింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఈ దాడులను ధ్రువీకరించారు. రక్షణ మంత్రి హెచ్చరిస్తూ.. "హౌతీలు ఏ చర్య తీసుకున్నా.. దానికి వారు మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. యెమెన్‌కు కూడా ఇరాన్‌కు పట్టిన గతే పడుతుంది. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా చేయి ఎత్తిన వారి చేతులు నరికేయబడతాయి." అని ఆయన హెచ్చరించారు.

ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేసింది?
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(IDF) ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ దాడికి కారణాన్ని వెల్లడించింది. ఇజ్రాయెల్ పౌరులు, దాని మిత్రదేశాలపై ఉగ్రవాద కుట్రలను అమలు చేయడానికి హౌతీ తిరుగుబాటుదారులు ఇరాన్ నుంటి ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నారని ఐడీఎఫ్ పేర్కొంది. ఈ దాడిలో ఇబ్, తైజ్ నగరాలకు విద్యుత్ సరఫరా చేసే హౌతీ నియంత్రిత విద్యుత్ కేంద్రం 'రాస్ కనాటిబ్'ను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. 2023లో హౌతీలు స్వాధీనం చేసుకున్న "గెలాక్సీ లీడర్" ఓడను ఇజ్రాయెల్ సైన్యం లక్ష్యంగా చేసుకుంది. గెలాక్సీ లీడర్ ఓడను హౌతీలు అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో నౌకలను గమనించడానికి రాడార్ సిస్టమ్‌గా ఉపయోగిస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.
హౌతీ తిరుగుబాటుదారులు ఏమన్నారంటే?
హౌతీ తిరుగుబాటుదారులకు సంబంధించిన మీడియా ఈ దాడిని ధ్రువీకరించింది. అయితే వారు కేవలం హుదైదా పోర్టుపై జరిగిన దాడిని మాత్రమే అంగీకరించారు. దాడి వల్ల జరిగిన నష్టం లేదా మరణాల గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇజ్రాయెల్ దాడి తర్వాత తమ వాయు రక్షణ వ్యవస్థలు చురుకుగా మారాయని, క్షిపణులతో దాడులకు ప్రతిస్పందించామని హౌతీ తిరుగుబాటుదారులు పేర్కొన్నారు.
ఇజ్రాయెల్-హౌతీ తిరుగుబాటుదారుల మధ్య ఎందుకు శత్రుత్వం?
ఇజ్రాయెల్-హమాస్ సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి, హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌పై నిరంతరం క్షిపణులను ప్రయోగిస్తున్నారు. అంతేకాకుండా, వారు ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్, పశ్చిమ దేశాలకు చెందిన నౌకలను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు. హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ నుంచి మద్దతు లభిస్తుంది. గత నెలలో కూడా ఇజ్రాయెల్ నావికాదళం హుదైదాలోని అనేక సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications