Gaza: యుద్ధం ముగిశాక గాజాను పాలించేదెవరు ? క్లారిటీ ఇచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని..

గత నెలలో హమాస్ తమ దేశంపై మెరుపు దాడులు చేసి దాదాపు 240 మందిని బందీలుగా పట్టుకుపోయిన తర్వాత గాజాపై ప్రతిదాడులకు దిగిన ఇజ్రాయెల్ ఇప్పటికీ వాటిని కొనసాగిస్తోంది. ప్రపంచ దేశాలు వద్దంటున్నా, ఐరాస హెచ్చరికలు జారీ చేస్తున్నా, మిత్రదేశాలైన అమెరికా, ఫ్రాన్స్ అలర్ట్ చేస్తున్నా గాజాపై దాడులు మాత్రం ఆపడం లేదు. ఈ నేపథ్యంలో యుద్దం ముగిశాక గాజాను తిరిగి ఇజ్రాయెల్ కైవసం చేసుకోబోతోందన్న చర్చ నడుస్తోంది.

హమాస్ దాడుల కేంద్రమైన గాజాపై భూమార్గంలో దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ .. ఈ విషయంలో వెనక్కితగ్గేందుకు అస్సలు ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో హమాస్ పై పోరు ముగిశాక గాజాను ఇజ్రాయెల్ తిరిగి ఆక్రమించుకుని తమ దేశంలో కలిపేసుకుంటుందన్న చర్చ జరుగుతోంది. అలా చేయొద్దంటూ ఇప్పటికే అమెరికా సహా మిత్రదేశాలు ఇజ్రాయెల్ ను హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇవాళ క్లారిటీ ఇచ్చారు.

Israel Prime Minister Netanyahu clarified who will rule Gaza after war ends

గాజాపై దాడులతో పాలస్తీనా అథారిటీని అక్కడి నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్న ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తాజాగా ఫాక్స్ న్యూస్‌తో తన దేశం గాజాను తిరిగి ఆక్రమించే ఆలోచనలో లేదని చెప్పారు.ఇజ్రాయెల్ 1967లో గాజాను ఆక్రమించింది. అలాగే 2005లో ఉపసంహరణను పూర్తి చేసే వరకు అక్కడే ఉండిపోయింది. ఆ తర్వాత గాజా పాలనను పాలస్తీనా అథారిటీకి వదిలేసింది.

ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో స్పందించిన బెంజమిన్ నెతన్యాహు...తాము గాజాను పరిపాలించటానికి ప్రయత్నించబోమన్నారు. తాము గాజాను ఆక్రమించేందుకు ప్రయత్నించమన్నారు. కానీ గాజా తమకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని మాత్రమే కోరుకుంటున్నట్లు నెతన్యాహు వెల్లడించారు. అలాగే గాజా భవిష్యత్తు కోసం తన ప్రణాళికను కూడా వెల్లడించారు. పేద, దిగ్బంధంలో ఉన్న ఈ భూభాగాన్ని సైనికీకరణ, నిర్మూలన, పునర్నిర్మించబడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+