మాల్దీవుల బ్యాన్ పై స్పందించిన ఇజ్రాయెల్-లక్షద్వీప్ వెళ్లాలని టూరిస్టులకు సూచన..!
పాలస్తీనా విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్న ఇజ్రాయెల్ పై ఇస్లామిక్ దేశమైన మాల్దీవులు తాజాగా నిషేధం విధించింది. ఇజ్రాయెల్ పర్యాటకుల్ని తమ దేశంలో అనుమతించబోమని తేల్చిచెప్పేసింది. దీంతో ఇజ్రాయెల్ ఇరుకునపడింది. మాల్దీవుల వైఖరిపై స్పందించిన ఇజ్రాయెల్ .. వారిని భారత్ లోని లక్షద్వీప్ కు వెళ్లాలని సూచించింది. దీంతో అంతర్జాతీయంగా ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇజ్రాయెల్ పాస్ పోర్టులపై నిషేధం విధించాలని మాల్దీవుల అధ్యక్షుడు మొయిజు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది ఎప్పటి నుంచి అమలవుతుందో మాత్రం చెప్పలేదు. దీంతో ఇంతకాలం మాల్దీవుల పర్యటనకు వెళ్తున్న ఇజ్రాయెల్ పర్యాటకుల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో వారు తమ ఎంబసీని సంప్రదించడం మొదలుపెట్టారు. దీంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం వారికి ప్రత్యామ్నాయంగా భారత్ లోని లక్షద్వీప్ ను సూచించింది.

"మాల్దీవులు ఇకపై ఇజ్రాయెల్ పౌరుల్ని స్వాగతించడం లేదు కాబట్టి, ఇక్కడ కొన్ని అందమైన, అద్భుతమైన భారతీయ బీచ్‌లు ఉన్నాయి, ఇక్కడ ఇజ్రాయెల్ పర్యాటకులను హృదయపూర్వకంగా స్వాగతిస్తారు, అత్యంత ఆతిథ్యంతో వ్యవహరిస్తారు. మా దౌత్యవేత్తలు సందర్శించిన ప్రదేశాల ఆధారంగా ఈ సిఫార్సులను పరిశీలించాలని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం తమ పౌరులకు సూచించింది.
ఇప్పటికే భారత్ తో విభేదాల కారణంగా పర్యాటకంగా తీవ్రంగా నష్టపోతున్న మాల్దీవులు.. ఇజ్రాయెల్ పై నిషేధంతో మరిన్ని సమస్యలు కొని తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే పర్యాటకంపై ఎక్కువగా ఆధారపడిన మాల్దీవులు తాజా చర్యలతో భారీగా ఆదాయం కోల్పోతోంది. అయితే చైనా సాయంతో కోలుకోవాలని ఆ దేశం భావిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications