ఇరాన్ కు చావు దెబ్బ.. చమురు శుద్ధి కేంద్రాలు ధ్వంసం.. భూస్థాపితం చేస్తామని నెతన్యాహూ వార్నింగ్

ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ లోని అణు కేంద్రాలు, వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులకు పాల్పడుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ సైన్యం తిప్పికొడుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం ఉదృతంగా మారింది. ఇప్పటికే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ కు చెందిన కీలక సైన్యాధికారులు, శాస్త్రవేత్తలు మృతి చెందారు.

ఇజ్రాయెల్ మరోసారి జూన్ 14న ఇరాన్ పై క్షిపణులతో దాడులు చేపట్టింది. కాంగన్ లోని సౌత్ పోర్ట్ సిటీ వద్ద గల సౌత్ పార్స్ చమురు శుద్ధి కేంద్రంపై ఇజ్రాయెల్ డ్రోన్లతో దాడులకు పాల్పడింది. ఇరాన్ ఆయిల్ అండ్ సహజ వాయువు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సౌత్ పార్స్ ఫేజ్ లోని 14 ఆయిల్ రిఫైనరీలపై ఇజ్రాయెల్ డ్రోన్ లు విరుచుకుపడ్డాయి. దీంతో ఈ చమురు శుద్ధి కేంద్రాలన్నీ ధ్వంసం అయ్యాయి.

Israel Targets Iran s Oil Infrastructure South Pars Refinery Hit in Major Strike

ఇరాన్ లోని చమురు శుద్ధి, సహజ వాయువు ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఇజ్రాయెల్ పథకం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ లోని చమురు శుద్ధి కేంద్రాలపై దాడుల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. దీంతో ఈ ఘర్షణలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో టెహ్రాన్ లోని ఇరాన్ న్యూక్లియర్ ప్రాజెక్టులో భాగమైన 9 మంది సీనియర్ శాస్త్రవేత్తలను హతం చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాయి. అణ్వాయుధాలను తయారు చేస్తున్న ఈ న్యూక్లియర్ ప్రాజెక్ట్ పై దాడికి పాల్పడినట్లు సమాచారం ఇచ్చింది. ఇక ఇజ్రాయెల్ జూన్ 13న జరిపిన దాడుల్లో 78 మంది ఇరాన్ పౌరులు మృతి చెందినట్లు తెలుస్తోంది. 329 మందికి గాయాలైనట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+