సీజ్‌ఫైర్‌కు కష్టాలు: మళ్లీ యుద్ధానికి సిద్ధమైన ఇజ్రాయెల్!
Israel: ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ.. ఇజ్రాయెల్ తాజాగా మరోసారి యుద్ధాన్ని ప్రారంభించేందుకు సిద్ధమని హెచ్చరించింది. ఈ ఉద్రిక్తతకు కారణం ఏమిటీ.. ఇరుపక్షాల వాదనలు ఏంటో తెలుసుకుందాం.
యుద్ధ విరమణ.. ఆ తర్వాత వార్నింగ్!
గాజాలో శాంతి స్థాపనకు మొదటి దశగా సోమవారం రోజున హమాస్ రెండు దశల్లో మొత్తం 20 మంది సజీవ బందీలను విడుదల చేసింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ సుమారు 2,000 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది. దీంతో గాజా పట్టణ ప్రజలు కూడా తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు. అయితే ఈ శాంతి ప్రక్రియ మధ్యలోనే ఇజ్రాయెల్ మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించేందుకు సిద్ధమని గట్టిగా హెచ్చరించింది.

ఇజ్రాయెల్ హెచ్చరికకు కారణం?
ఇజ్రాయెల్ ఇప్పటికే గాజా నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవడం ప్రారంభించింది. కానీ హమాస్ చనిపోయిన బందీల మృతదేహాలను తిరిగి ఇవ్వడం లేదని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇది యుద్ధ విరమణ ఒప్పందంలోని షరతును ఉల్లంఘించడమేనని ఇజ్రాయెల్ అంటోంది. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా జోక్యం చేసుకున్నారు. చనిపోయిన బందీల మృతదేహాలను వీలైనంత త్వరగా ఇజ్రాయెల్‌కు అప్పగించాలని ట్రంప్ హమాస్‌కు ఆదేశాలు జారీ చేశారు.
హమాస్ వాదన ఏంటి?
హమాస్ ఇప్పటివరకు 10 మంది చనిపోయిన బందీల మృతదేహాలను ఇజ్రాయెల్‌కు అప్పగించింది. వీటిలో 7 మృతదేహాలు బందీలవే అని ధ్రువీకరించబడింది.. అయితే ఒక మృతదేహం మాత్రం బందీది కాదని ఇజ్రాయెల్ పేర్కొంది. మరో ఇద్దరు బందీల మృతదేహాల ధ్రువీకరణ ఇంకా కొనసాగుతోంది.
తాము ఎంత మంది చనిపోయిన బందీల మృతదేహాలను ఇవ్వగలమో అంత మందిని ఇచ్చేశామని హమాస్ వాదిస్తోంది. వారి వాదన ప్రకారం, గాజా నగరంలోని శిథిలాల నుంచి బందీల మిగిలిన మృతదేహాలను ప్రత్యేక పరికరాలు లేకుండా బయటకు తీయడం అసాధ్యం. మృతదేహాల అప్పగింత విషయంలో ఏర్పడిన ఈ ప్రతిష్టంభన.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధ విరమణకు మళ్లీ ముప్పుగా మారే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications