షాకింగ్ న్యూస్: లైవ్‌లో ఏడ్చుకుంటూ చదివేసిన యాంకర్(వీడియో)
తాను పని చేస్తున్న సంస్థ హఠాత్తుగా మూత పడుతుందని తెలిస్తే అందులో పనిచేసే ఏ ఉద్యోగికైనా బాధగానే ఉంటుంది. అయితే కొందరు దీన్ని సాధారణంగా తీసుకుంటే మరికొందరు మాత్రం భావోద్వేగానికి లోనవుతుంటారు.
ఇజ్రాయిల్: తాను పని చేస్తున్న సంస్థ హఠాత్తుగా మూత పడుతుందని తెలిస్తే అందులో పనిచేసే ఏ ఉద్యోగికైనా బాధగానే ఉంటుంది. అయితే కొందరు దీన్ని సాధారణంగా తీసుకుంటే మరికొందరు మాత్రం భావోద్వేగానికి లోనవుతుంటారు. ఇలాంటి ఘటనే ఎదురవడంతో ఓ ఇజ్రాయిలీ యాంకర్ మాత్రం లైవ్ ప్రోగ్రాంలోనే వార్తలు చదువుతూ కన్నీటిపర్యాంతమైంది.
వివరాల్లోకి వెళితే.. ఇజ్రాయిల్‌కి చెందిన గ్యులా ఈవెన్ సార్.. ఛానెల్ 1 న్యూస్ అనే వార్తా సంస్థలో యాంకర్‌గా పనిచేస్తోంది. ఈ వార్తా ఛానెల్ ఇజ్రాయిల్‌లో చాలా ఫేమస్. దీనికి దాదాపు 49 ఏళ్ల చరిత్ర ఉంది. కొన్ని రాజకీయ వివాదాల కారణంగా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు ఈ ఛానెల్ మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు.
గ్యులా వార్తలు చదువుతున్న సమయంలోనే ఈ విషయం ఆమెకి తెలిసింది. దీంతో వార్తలు చదువుతూనే ఉద్వేగానికి లోనైంది. ముందస్తు హెచ్చరికలు లేకుండానే ఇలా హఠాత్తుగా ఛానల్‌ను మూసివేయడం సరికాదని ఆమె అన్నారు.
నేతన్యాహు మీడియా పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లానే వ్యవహరిస్తున్నారంటూ ఆ ఛానెల్ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరిలాగే తన భార్య కూడా తన బావోద్వేగాల్ని ఆపుకోలేకపోయారని గ్యులా భర్త, మాజీ విద్యాశాఖ మంత్రి గిడన్ తెలిపారు. కాగా, మంగళవారం సాయంత్రం నుంచే సదరు న్యూస్ ఛానల్ ప్రసారాలను నిలిపేయాలంటూ న్యాయమంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు జారీ కావడంతో ఆ ఛానల్ మూతపడింది.












Click it and Unblock the Notifications