తప్పుడు వాగ్ధానాలిచ్చి గెలవడంకన్నా ఓడిపోవడం మేలు

బ్రిటన్ ప్రధానమంత్రి పదవి కోసం కన్జర్వేటివ్ నేతలు రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. బీబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో రిషి సునాక్ మాట్లాడుతూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తప్పుడు వాగ్దానాలతో విజయం సాధించడంకన్నా ఓడిపోవడం మేలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జీవన వ్యయాలు పెరగడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కుటుంబాలను ఆదుకోవడానికి తాను కట్టడివున్నట్లు రిషి వెల్లడించారు. పన్నుల్లో కోతలు విధిస్తానంటూ ఇచ్చిన హామీ గురించి రిషి మాట్లాడుతూ దీనివల్ల అవసరంలో ఉన్నవారికంటే ధనవంతులకే మేలు జరుగుతుందని, ఇలాంటి తప్పుడు వాగ్ధానాలతో గెలవడంకన్నా ఓడిపోవడమే మేలన్నారు. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో ప్రజలకు సహకరించాలని నిశ్చయించుకున్నానని, ప్రజల డబ్బును తీసుకోకుండా ఉండేందుకే తాను ప్రాధాన్యతనిస్తానని వ్యాఖ్యానించారు.

It is better to lose than to win by making false promises

Recommended Video

    ఆనంద్ మహీంద్ర ప్రశ్న? కేసీఆరేనంటూ మనవడు హిమాన్షు ట్వీట్ *National | Telugu OneIndia

    కొవిడ్ సమయంలో ఆర్థిక మంత్రి తాను తీసుకున్న నిర్ణయాల గురించి మాట్లాడారు. చెప్పినవాటికంటే మెరుగైన నిర్ణయాలు తీసుకుంటానని రిషి హామీ ఇచ్చారు. ద్రవ్యోల్బణం గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారని, పెరిగిన విద్యుత్తు చార్జీల గురించి ప్రజలు కంగారుపడుతున్నారని, ప్రధానమంత్రి అయితే ఆ కుటుంబాలను ఆదుకోవడానికి మరిన్ని నిర్ణయాలు తీసుకుంటానన్నారు. అప్పటితో పోల్చుకుంటే ప్రస్తుతం పరిస్థితి దిగజారిందన్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి కోసం పోటీపడుతున్న లిజ్ ట్రస్, రిషి సునాక్ మధ్య పోరు తీవ్రంగా ఉందని, మొగ్గు మాత్రం ట్రస్ వైపుఉందని సర్వేలు సూచిస్తున్నాయి. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకోవాలని ట్రస్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు రిషికి అనుకూలంగా మారింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+