వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేప్ చేస్తుంటే కేకలు పెట్టలేదు.. అది అత్యాచారం కాదు: ఇటలీ కోర్టు

అత్యాచార సమయంలో బాధితురాలి ప్రతిస్పందన దాన్ని అత్యాచారం అనడానికి ఊతమిచ్చేలా లేదని కోర్టు చెప్పింది.

|
Google Oneindia TeluguNews

ఇటలీ: ఓ అత్యాచార కేసులో ఇటలీ కోర్టు ఇచ్చిన తీర్పు అక్కడి న్యాయ వ్యవస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తేలా చేసింది. అత్యాచార సమయంలో బాధితురాలు కేకలు పెట్టలేదన్న కారణంతో నిందితుడిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. దీంతో ఇటలీ న్యాయవ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో కేసుపై పునర్విచారణ చేపట్టాలని న్యాయశాఖ ఆదేశించింది. కాగా, ఇటలీలోని రెడ్ క్రాస్ సంస్థలో పనిచేస్తున్న ఓ వ్యక్తి (46) తన సహోద్యోగినిపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలతో కేసు కోర్టుకు ముందుకు వచ్చింది. విచారించిన కోర్టు ఘటన సమయంలో మహిళా ఉద్యోగిని ప్రతిస్పందనపై వివాదస్పద రీతిలో స్పందించింది.

Italian court says no rape happened as woman didn’t scream, minister takes stock

అత్యాచార సమయంలో బాధితురాలి ప్రతిస్పందన దాన్ని అత్యాచారం అనడానికి ఊతమిచ్చేలా లేదని కోర్టు చెప్పింది. కేవలం 'ఇక చాలు' అని మాత్రమే బాధితురాలు అన్నందువల్ల ఇది అత్యాచారం కిందకు రాదని కోర్టు తెలిపింది.ఇదే కారణంతో నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసింది.

అయితే కోర్టు ఇచ్చిన ఈ తీర్పు అంతర్జాతీయ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో.. ఘటనను విచారించిన తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇటలీ న్యాయవ్యవస్థను చాలామంది తప్పుపట్టడంతో.. మరోసారి దీనిపై న్యాయ విచారణ చేపట్టాలని మంత్రి అన్నాగ్రాజియా కలాబ్రియా ఆదేశించారు.

English summary
Italy’s justice minister has reportedly asked officials to look into a case in which a court acquitted a man of raping a woman because she didn’t scream.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X