వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇటలీ: విప్లవ మహిళ విగ్రహాన్ని అశ్లీలంగా తయారుచేశారంటూ ఆందోళన

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఇటలీలో విగ్రహం

ఇటలీలో ఏర్పాటు చేసిన ఒక మహిళ విగ్రహం చుట్టూ వివాదాలు రేగుతున్నాయి. ఈ విగ్రహాన్ని 19వ శతాబ్దం నాటి ఒక కవితను గుర్తు చేసుకునేలా ఏర్పాటుచేశారు.

కానీ, ఇప్పుడు ఈ విగ్రహం చుట్టూ సెక్సిజం చర్చ రాజుకుంది. ఒంటికి అతుక్కుని ఉన్నట్లుగా దుస్తులు ధరించిన మహిళ విగ్రహం ఇది. ఆ మహిళ ఒక చేతిని తన వక్ష స్థలంపై పెట్టుకుని కనిపిస్తుంది.

ఈ విగ్రహాన్ని తొలగించాలని ఇటలీకి చెందిన కొందరు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రముఖ ఇటలీ కవి 'లూయిజీ మిర్కాంటినీ’ రాసిన 'లా స్పీగోలాత్రిస్ దీ సప్రీ' అనే కవితకు గౌరవంగా దక్షిణ ఇటలీలోని సాప్రీ నగరంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

https://twitter.com/lauraboldrini/status/1442235735478702081?

అంత వివాదం ఎందుకు

ఈ విగ్రహంపై ఇటలీలోని రాజకీయ, సామాజిక వర్గాల్లో జోరుగా చర్చ మొదలైంది. ఇటలీ చరిత్రలో మహిళలు చురుకైన పాత్ర పోషించడమే దీనికి కారణం.

"సంతోషంగా గుర్తు చేసుకోవాల్సిన చరిత్రలోని మహిళలను ఈ విగ్రహం అవమాకరంగా చూపిస్తోంది" అని ఇటలీ కాంగ్రెస్‌ ఎంపీ సాస్ లారా బోలెద్రీనీ అన్నారు.

"మహిళను ఒక సెక్సువల్ శరీరంగా ఏదైనా ఒక సంస్థ ఎలా అంగీకరించగలదు. ఇటలీలో చాలా ఘోరమైనవాటిలో పురుష దురహంకారం ఒకటి" అన్నారు లారా.

పొలంలో మిగిలిపోయిన ధాన్యాన్ని సేకరించే ఒక మహిళ గురించి 19వ శతాబ్దంలో ఆ కవితను రాశారు.

ధాన్యం సేకరిస్తున్న తన పనిని మధ్యలోనే వదిలి ఇటలీలోని విప్లవంలో పాల్గొన్న మహిళ గురించి ఆ కవితలో చెప్పారు. ఆ విప్లవంలో 300 మంది చనిపోయారు.

ఈ మహిళ విగ్రహాన్ని ఆదివారం ఇటలీ మాజీ ప్రధాని కాన్తే, జాతీయ, స్థానిక నేతల సమక్షంలో ఆవిష్కరించారు.

https://twitter.com/MonicaCirinna/status/1442204598190714891?

విగ్రహం కూల్చేయాలని డిమాండ్

ఈ విగ్రహాన్ని కూల్చేయాలని మహిళా నేతల బృందం ఒకటి డిమాండ్ చేసింది. "మనల్ని మనం లైంగికవాంఛలు రేకెత్తించే ఒక శరీరంలా మరోసారి చూడాల్సి వచ్చినందుకు సిగ్గు పడుతున్నాం" అంటూ వారు ప్రకటన విడుదల చేశారు.

ఈ విగ్రహానికి సామాజిక, రాజకీయ అంశాలకు ఎలాంటి సంబంధం లేదు. దీనికి ఎలాంటి ఆత్మ కూడా లేదు అని వారు అందులో పేర్కొన్నారు.

దీనిని చరిత్రకు, మహిళలకు ఒక చెంపదెబ్బగా డెమాక్రటిక్ పార్టీ ఎంపీ మోనికా చిరిన్నా వర్ణించారు.

"అణచివేతదారులకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి, తన పనిని కూడా వదిలేసిన ధాన్యం సేకరించే ఆ మహిళ నిబద్ధత గురించి ఈ విగ్రహం ఏమీ చెప్పడం లేదు" అని ఆమె ట్వీట్ చేశారు.

విలువలు, సిద్ధాంతాలు, సంప్రదాయాలపై ప్రశ్నించడానికి నగరం సిద్ధంగా లేదని నగర మేయర్ అన్నారు.

విగ్రహం చెక్కిన శిల్పి ఏమన్నారు

ఈ విగ్రహం చెక్కిన శిల్పి స్టిఫానో కూడా ఈ మొత్తం వివాదంపై ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దీనిపై విమర్శలు రావడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

"పురుషులవైనా, మహిళలవైనా నా విగ్రహాలను నేను ఎప్పుడూ తక్కువ బట్టల్లోనే చూపించాలని అనుకుంటాను" అని తనను తాను సమర్థించుకున్నారు.

"ఈ విగ్రహం విషయానికి వస్తే ఆమెను ఒక ఆదర్శ మహిళగా, చైతన్యాన్ని మేలుకొలిపేలా చూపాలని అనుకున్నాను" అని చెప్పారు,

విగ్రహం డిజైన్‌ను అధికారులు ఆమోదించిన తర్వాతే దాన్ని రూపొందించినట్లు కూడా స్తిఫానో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Italy: Concern over revolutionary woman statue being made into pornography
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X