కరోనా మరణాల్లో ఇటలీ రికార్డ్: 24గంటల్లోనే 475 మంది మృతి, చైనాను మించి ప్రభావం

రోమ్: కరోనావైరస్ చైనాలో పుట్టి అక్కడ వేలాది మంది ప్రాణాలు తీసి.. ఇప్పుడు ఇప్పుడు ప్రపంచంపై పడింది. కరోనా ప్రభావం చైనా తర్వాత ఇటలీలోనే ఎక్కువగా ఉండటం గమనార్హం. కాగా, చైనాలో మరణాలు తగ్గగా.. ఇటలీలో కరోనా మరణాలు పెరుగుతుండటం అక్కడి ప్రజలను ఆందోళనలకు గురిచేస్తున్నాయి.

గడిచిన 24 గంటల్లోనే ఇటలీలో అత్యధికంగా 475 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఈ మరణాల సంఖ్యను బట్టి ఇటలీలో కరోనా ప్రభావం ఏ మేర ఉందో చెప్పవచ్చు. కరోనా వైరైస్ కారణంగా ఒకే రోజులో ఇంత ఎక్కువ మరణాలు సంభవించిన తొలి దేశం కూడా ఇటలీనే కావడం గమనార్హం.

Italy coronavirus deaths rise by record 475 in 24 hours.

కరోనావైరస్ చైనాలోనే పుట్టినప్పటికీ ఆ దేశంలో కూడా ఒక్క రోజులో ఈ స్థాయిలో మరణాలు సంభవించలేదు. ఇటలీలో కరోనావైరస్ వ్యాప్తికి అనుకూల వాతావరణం ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 475 మంది మరణించడంతో ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 2,978కి చేరిందని అక్కడి అధికారులు తెలిపారు. ఇక కరోనాబారిన పడిన వారి సంఖ్య 35,713కు చేరింది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా మృతుల సంఖ్య 9వేలకు చేరగా.. బాధితుల సంఖ్యల 2లక్షలు దాటింది. చైనా తర్వాత ఇటలీ, ఇరాన్ దేశాల్లోనే కరోనా మరణాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. ఐరోపాతోపాటు అమెరికాలోనూ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఇటలీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రాకూడాదని ఆదేశాలు జారీ చేశారు. మనదేశంలో కూడా కరోనా బారినపడిన వారి సంఖ్య 172కు చేరింది. మూడు మరణాలు చోటు చేసుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+