వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి ఏంటి.. సెనేట్‌కు చేరనున్న అభిశంసన తీర్మానం

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: తనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం అన్యాయమైన చర్య అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని తన నాయకత్వంలో అమెరికా పురోగమిస్తోందని చెప్పారు. ఇదే విషయాన్ని తెలుపుతూ అగ్రరాజ్యపు అధినేత ట్రంప్ ట్వీట్ చేశారు. ఇప్పటికే అభిశంసన తీర్మానంలోని రెండు ఆర్టికల్స్‌కు కాంగ్రెస్ ఆమోదం తెలపిని నేపథ్యంలో ట్రంప్ ఈ ట్వీట్ చేశారు.

ట్రంప్‌పై ప్రవేశపెట్టిన క అభిశంసన తీర్మానం ప్రతినిధుల సభ ముందుకు రానుంది. ఇక్కడే ట్రంప్‌కు చిక్కులు తలెత్తే అవకాశం ఉంది. ప్రతినిధుల సభలో ట్రంప్ ప్రత్యర్థి పార్టీ అయిన డెమొక్రటిక్ పార్టీకి మెజారిటీ ఉంది. ఒక్కసారి అభిశంసన తీర్మానంకు సభ ఆమోదం తెలిపితే ఆ తర్వాత ప్రక్రియ ప్రారంభం అవుతుంది. వెంటనే తీర్మానం 100 మంది నేతలున్న అమెరికా సెనేట్‌కు వెళుతుంది. ఇక్కడ ట్రంప్ పార్టీ రిపబ్లికన్ పార్టీకి మెజార్టీ ఉంది. లెఫ్టిస్ట్ భావజాలాలున్న డెమొక్రాట్లు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారని ట్రంప్ ట్వీట్ చేశారు. దేశానికి డెమొక్రాట్లు ప్రమాదంగా అవతరిస్తున్నారని మండిపడ్డారు.

Its unfair that im being impeached, tweets Donald Trump

అంతకుముందు తనపై వచ్చిన అభిశంసన తీర్మానం రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు పన్నిన కుట్రగా ట్రంప్ అభివర్ణించారు. ఈ కుట్ర వాస్తవానికి ఇప్పుడు ప్రారంభమైనది కాదని ఎప్పటి నుంచో ఇది జరుగుతోందని ట్రంప్ వైట్ హౌజ్‌లో వ్యాఖ్యానించారు.తాను ఎక్కడా తప్పు చేయలేదని ట్రంప్ అన్నారు. తనను తొలగించేందుకు అభిశంసన తీర్మానంను ఆయుధంగా చేసుకోవడం దారుణమని ధ్వజమెత్తారు. అభిశంసన తీర్మానం కేవలం అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడే వినియోగిస్తారని గుర్తుచేశారు. ఇలా జరిగి చాలా ఏళ్లు అయ్యిందని ట్రంప్ చెప్పారు. తను ఒబామా చేసిన దానికంటే చాలా ఎక్కువగానే చేశానని చెప్పుకొచ్చారు ట్రంప్. ఉక్రెయిన్ అధ్యక్షుడే తనపై ఎవరూ ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని చెబుతుండగా మళ్లీ అభిశంసన తీర్మానం ఏంటని ట్రంప్ ప్రశ్నించారు. ఇదొక పెద్ద స్కామ్ అని మండిపడ్డారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ట్రంప్ చెప్పారు.

ఇక ఎన్నికల సందర్భంగా తమ పార్టీకి భారీ స్థాయిలో విరాళాలు వచ్చాయని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఎప్పుడూ లేనంతగా విరాళాలు వచ్చాయని ఒక రికార్డును రిపబ్లికన్ పార్టీ క్రియేట్ చేసిందని చెప్పారు. ఇదిలా ఉంటే సెనేట్‌కు అభిశంసన తీర్మానం పంపే ప్రక్రియ వేగవంతమైంది. సెనేట్‌లోని ప్రతి ఒక్క సెనేటర్ ఎలాంటి తమ పర అనే బేధం లేకుండా న్యాయం చెబుతామని ప్రమాణం చేయాల్సి ఉంటుంది.

English summary
US President Donald Trump has said that it is unfair that he was being impeached as he had done no wrong and the US, under his leadership, was doing quite good.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X