డొనాల్డ్ ట్రంప్ పై పుస్తకం, సంచలన విషయాలు వెల్లడించిన మొదటి భార్య ఇవానా..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ ఓ పుస్తకాన్ని విడుదల చేస్తున్నారు. ‘రైజింగ్ ట్రంప్’ పేరుతో రాసిన పుస్తకంలో తన వైవాహిక జీవితం గురించి సంచలన విషయాలు వెల్లడించారు.
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ ఓ పుస్తకాన్ని విడుదల చేస్తున్నారు. 'రైజింగ్ ట్రంప్' పేరుతో రాసిన ఆ పుస్తకంలో ఆమె ట్రంప్‌తో తన వైవాహిక జీవితం గురించి సంచలన విషయాలు వెల్లడించారు.
ట్రంప్ ఏ విధంగా ఎదిగారు? ట్రంప్ తనకు ఏ విధంగా దూరం అయ్యారు? ట్రంప్ వ్యక్తిగత జీవితం ఎలా ఉండేది? ఇలాంటి విషయాలెన్నో ఇవానా ట్రంప్ రాసిన పుస్తకంలో ఉన్నాయి. ముఖ్యంగా ట్రంప్‌తో తన వైవాహిక జీవితం బద్ధలవుతుందనే విషయం తనకు ముందే ఎలా తెలిసిందో ప్రత్యేకంగా వెల్లడించారు.

డొనాల్డ్ ట్రంప్‌కు ఇవానా ట్రంప్‌కు 1977లో వారి వివాహం అయింది. 1992వరకు ఆ బంధం నిలిచినా చివరికి విడాకులతో విడిపోయారు. అయితే, వారిద్దరు విడిపోతారనే విషయం ట్రంప్ భార్య ఇవానాకు 1989లోనే తెలిసిందంట. ట్రంప్ మర్లా మ్యాపిల్స్ అనే మహిళను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
వారి పెళ్లికి ముందే మర్లా.. ట్రంప్ మొదటి భార్య ఇవాను నేరుగా కలిసినట్లు తెలిపారు. 'మర్లా ఆ రోజు నేరుగా నీలిరంగుల దుస్తుల్లో వచ్చింది. ''నేను మర్లా.. నీ భర్తను ప్రేమిస్తున్నాను.. మరి నువ్వు?'' అని అడిగింది
''నేనన్నాను.. నేను నా భర్తను విపరీతంగా ప్రేమిస్తున్నాను.. ఇక్కడ నుంచి వెంటనే వెళ్లిపో.. '' అని మర్లాను వెళ్లగొట్టాను.. ఆ రోజు నేను షాకయ్యాను.. అప్పుడే నాకు భయం పట్టుకుంది.. ఇక మా వివాహం ముగింపు దశకు వచ్చిందని..'' అంటూ ఇవానా తను రాసిన ఆ పుస్తకంలో పేర్కొన్నారు.
ఇలా ఇంకా ఎన్నో షాకింగ్ విషయాలను ట్రంప్ మొదటి భార్య తాను రాసిన పుస్తకంలో వివరించారు. డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత జీవిత విశేషాలతో వచ్చే వారమే ఈ పుస్తకం మార్కెట్‌లోకి విడుదల కానుంది.
-
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
ఖమేనీ సంధి ఒప్పందం? -
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..!












Click it and Unblock the Notifications