వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీడియాను నిలదీసిన ట్రంప్ కూతురు: 'మారుభార్య' అనడం ఎంతవరకు కరెక్ట్?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : గతంలో మహిళలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు.. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన భారీ మూల్యం చెల్లించుకుంటున్న సంగతి తెలిసిందే. ఆఖరికి సొంత కూతురిపై సైతం ట్రంప్ చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఆయన పరువు బజారున పడింది. అటు జనంలోను ఇటు మీడియాలోను ఆయన పరువు అంతకంతకూ దిగజారుతూనే ఉంది.

'నేను గనుక మరో ఇరవై ఏళ్ల తర్వాత పుట్టి ఉంటే.. నా కూతురితో డేటింగ్ చేసేవాన్ని' అసలే వివాదస్పద వ్యాఖ్యలతో ఇప్పటికే తన పొలిటికల్ మైలేజిని చేజేతులా నాశనం చేసుకున్న ట్రంప్.. ఈ ఒక్క వ్యాఖ్యతో కాస్తో కూస్తో ఉన్న పరువును కూడా పోగొట్టుకున్నారు. అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీడియా-జనం ఏకమై దుమ్మెత్తి పోయగా.. ట్రంప్ కూతురు ఇవాంకా మాత్రం తండ్రి వ్యాఖ్యలపై స్పందించలేదు.

అయితే తొలిసారిగా ఇవాంకా.. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్పందించింది. 'ఒక తండ్రిగా ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పే. వ్యాఖ్యలను ఖండించాల్సిందే. అయితే ఆ వీడియో బహిర్గతం అయిన వెంటనే అమెరికన్లందరికీ ఆయన క్షమాపణలు చెప్పారు, నాన్న గురించి సమాజం కన్నా ఎక్కువగా నాకే బాగా తెలుసు కాబట్టి, నేను ఆయన్ను అర్థం చేసుకోగలను' అంటూ చెప్పుకొచ్చారు ఇవాంకా.

Ivanka Trump breaks her silence on dad's lewd comments

అదే సమయంలో.. మీడియా వైఖరిని సైతం తప్పుబట్టింది ఇవాంకా. కూతురితో డేటింగ్ వ్యాఖ్యలను తప్పుబట్టిన మీడియా.. 'ఇవాంకా ట్రంప్ కు సెరోగేట్ వైఫ్(మారు భార్య) అంటూ ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం?' అంటూ ప్రశ్నించింది. మీడియా వైఖరి తనను ఎంతగానో బాధపెట్టిందని, బాధ్యత గల మీడియా ఇలాంటి ప్రచారం చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు ఇవాంకా. కాగా, ట్రంప్ సెక్సువల్ కామెంట్స్ ను ఆయన భార్య మెలానియా ఖండించిన సంగతి తెలిసిందే.

ఇదంతా ఇలా ఉంటే.. జరుగుతున్న పరిణామాల చూస్తోంటే ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఆయన భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే అనిపిస్తోంది. మహిళలను చులకన చేస్తూ ఆయన చేసిన లైంగిక వ్యాఖ్యలు నవంబర్ 8న జరగబోయే పోలింగ్ లో స్పష్టమైన ప్రభావం చూపించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

English summary
For the first time Ivanka Trump, who has been a major fixture in her father's efforts to reach out to women voters, publicly addressed the lewd comments Donald Trump made during a 2005 taping of Access Hollywood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X