ఆశ్చర్యం: ట్రంప్ కూతురు, అల్లుడి జీతం ఎంతో తెలుసా?

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కుమార్తె ఇవాంకా ట్రంప్ కు ప్రభుత్వంలో ఏ పదవి కట్టబెట్టాలనే విషయంలో ఆయన ఒక క్లారిటీకి వచ్చారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తనతోపాటు తీవ్రంగా శ్రమించి, తన గెలుపునకు సోషల్ మీడియాలో విశేషంగా కృషి చేసిన ఇవాంకాకు ఏ పదవి ఇవ్వాలనే విషయంలో ట్రంప్ ఇన్నిరోజులూ మల్లగుల్లాలు పడ్డారు.

అధ్యక్షుడికి సలహాదారుగా...

అధ్యక్షుడికి సలహాదారుగా...

ఎట్టకేలకు అధ్యక్షుడి సలహాదారు పదవికి ఆమెను నామినేట్ చేయనున్నారు. ఇవాంకా ట్రంప్ కు ప్రభుత్వ పదవి ఇస్తూ వైట్ హౌస్ బుధవారమే అధికారిక ప్రకటన జారీ చేసింది.
అయితే ఈ పదవిలో ఉండి బాధ్యతలు నిర్వర్తిస్తున్నందుకు ఆమె ఎంత జీతం తీసుకుంటారో తెలుసా?

ఒక్క పైసా తీసుకోకుండా...

ఒక్క పైసా తీసుకోకుండా...

అక్షరాలా సున్నా రూపాయలు. అవును.. మీరు చదివింది నిజమే! అధ్యక్షుడి సలహాదారుగా పనిచేసినందుకు ఇవాంకా ఎలాంటి జీతం తీసుకోరట. ఇప్పటికే ఇవాంకా భర్త.. రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త జరేడ్ కుష్నెర్ కూడా ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతున్నారు.

భర్త కుష్నెర్ కూడా...

భర్త కుష్నెర్ కూడా...

ఆయన తన మామ, అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ కు సీనియర్ సలహాదారుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పదవిలో ఉన్నప్పటికీ ఈయన కూడా జీతం తీసుకోవడం లేదట.

అధికారం ఉంది కదాని...

అధికారం ఉంది కదాని...

ప్రభుత్వంలో పారదర్శకత కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఇవాంకా ట్రంప్, ఆమె భర్త కుష్నెర్ చెబుతున్నారు. రాజకీయాల్లో విలువలు ముఖ్యమనీ, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించాలని తాము అనుకోవడం లేదని వారు స్పష్టం చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Washington: Ivanka Trump is changing course and will become a government employee in the coming days, a White House official told CNN Wednesday. President Donald Trump's eldest daughter will be an unpaid employee working in the West Wing. ... Jared Kushner, Ivanka's husband and a ...
Please Wait while comments are loading...