సముద్రంలో కూలిన విమానం: నలుగురు మృతి, ఆరుగురికి గాయాలు
అబిద్‌జాన్: అబిద్‌జాన్‌లోని ఐవరీ కోస్ట్ సముద్ర తీరంలో ఓ కార్గో విమానం కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. మరో ఆరుగురు గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని రాయిటర్స్ స్పష్టం చేసింది.

ఐవరీ కోస్ట్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో సహాయక బృందాలు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకున్నాయి.
మృతదేహాలను బయటికి తీసి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా విమానం కూలినట్లు అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications