
మోదీపై భారీ కుట్ర: అమెరికాలో మంత్రి Jaishankar గగ్గోలు -Vaccineమైత్రికి కసరత్తు -హిందూత్వ ఇమేజ్ పైనా
భారత ప్రధాని నరేంద్ర మోదీ బాహాటంగా రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్‌కు ఓటేయాలని పిలుపునిచ్చినా, అమెరికా ఎన్నికల్లో డెమోక్రాట్ జో బైడెన్ ఘనవిజయం సాధించిన తర్వాత భారత ప్రభుత్వం తరఫున అమెరికాలో తొలి అధికారిక పర్యటన జరుపుతున్నారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్. ఐదు రోజుల పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక సంబంధాలు, పసిఫిక్ రీజియన్ లో క్వాడ్ పటిష్టత, భారత్-అమెరికా మధ్య కొవిడ్ వ్యాక్సిన్ మైత్రి అంశాలపై మంత్రి ఫోకస్ పెట్టారు. అదే సమయంలో భారత్ లో నెలకొన్న రాజకీయాలపై ప్రధాని మోదీపై పెరుగుతోన్న వ్యతిరేకతపైనా జైశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాలివి..
రఘురామ
కోసం
కదిలిన
మోదీ
సర్కార్
-కరోనాలోనూ
ఢిల్లీ
ఎయిమ్స్‌లో
స్పెషల్
చేరిక
-కష్టంలో
తోడున్నందుకు
Covid
పుట్టుకపై
90రోజుల్లో
దర్యాప్తు-Joe
Biden
సంచలన
ఆదేశాలు
-చిక్కుల్లో
China,
వూహాన్
ల్యాబ్
గుట్టు

ఇండో-యూఎస్ వ్యాక్సిన్ మైత్రి
భారత్ లో కొవిడ్ రెండో దశ విలయం ప్రమాదకరంగా కొనసాగుతుండటం, దేశీయంగా వ్యాక్సిన్ల కొరతను ఇప్పట్లో అధిగమించే పరిస్థితులు లేకపోవడంతో అగ్రరాజ్యం అమెరికా నుంచి భారత్ వ్యాక్సిన్ మైత్రి కోరుతున్నది. విదేశాంగ మంత్రి జైశంకర్ తన పర్యటనలో ఈ అంశంపై గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అధకార డెమోక్రాట్లు, ప్రతిపక్ష రిపబ్లికన్లు అనే తేడాలేకుండా అమెరికా చట్టసభల్లో సభ్యులైన, విదేశీ వ్యవహారాల కమిటీల్లో ముఖ్యులైన పలువురిని ఆయన కలుసుకుని వ్యాక్సిన్లపై చర్చలుచేశారు. 'కొవిడ్ పై భారత్ చేస్తోన్న పోరాటంలో అమెరికా కాంగ్రెస్ మద్దతు ఉపకారిగా ఉంది''అని జైశంకర్ ట్వీట్ చేశారు. వ్యాక్సిన్ల విషయంలో భారత్ కు అదనపు సాయం అందించేలా బైడెన్ ఫెడలర్ ప్రభుత్వంతో మాట్లాడుతామని అక్కడి నేతలు హామీ ఇచ్చారు. భారత సంతతి వ్యాపార, వాణిజ్యవేత్తలతో భేటీలోనూ వ్యాక్సిన్ల అంశాన్ని మంత్రి ప్రస్తావించారు.

ఎన్ఎస్ఏ జేక్‌తో కీలక భేటీ
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) జేక్ సులివాన్ తోనూ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ అయ్యారు. పసిఫిక్ రీజియన్ లో చైనా ఏకపక్ష ధోరణికి చెక్ పెట్టేలా అమెరికా, జపాన్, భారత్, ఆస్ట్రేలియాలు క్వాడ్ గ్రూపుగా ఏర్పడిన నేపథ్యంలో క్వాడ్ కార్యకలాపాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు. అఫ్గానిస్తాన్ లో శాంతిపున:స్థాపన దిశగా అమెరికా చేస్తోన్న ప్రయత్నాలకు భారత్ సపూర్ణ మద్దతు ఇస్తుందని మంత్రి మాటిచ్చారు. అలాగే కొవిడ్ వ్యాక్సిన్ల విషయంలో భారత్-అమెరికా మధ్య భాగస్వామ్యంతో కరోనాపై పోరాటంలో కీలక మలుపుగా నిలుస్తుందని జైశంకర్ ఉద్ఘాటించారు. కాగా, భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వ్యాక్సిన్ల విషయంలో అమెరికా నుంచి హామీలే తప్ప కచ్చితమైన ఒప్పందాలు లేదా సహాయ ప్రకటన ఇప్పటిదాకా వెలువడలేదు. ఇదిలాఉంటే.

అమెరికాలో జైశంకర్ అనూహ్యం..
కరోనా వేళ అత్యంత కీలంగా భావిస్తోన్న అమెరికా పర్యటనలో భారత మంత్రి జైశంకర్ రాజకీయాలకు సంబంధించి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీలోని హూవర్ ఇనిస్టిట్యూట్ వేదికగా యూఎస్ నేషనల్ సెక్యూరిటీ మాజీ సలహాదారు హెచ్ఆర్ మెక్‌మాస్టర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై భారీ ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని, రాజకీయ వైరిపక్షాలు ఉద్దేశపూర్వకంగా ఈ పనిని చేస్తూ, అంతర్జాతీయంగా మోదీ ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలనుకుంటున్నాయని జైశంకర్ ఆరోపించారు. అయితే, భిన్నత్వానికి చిరునామా అయిన భారత్ లో భావవైరుధ్యాలు సహజమేననీ ఆయన పేర్కొన్నారు. మోదీ సర్కార్ హిందూత్వ విధానాల వల్ల భారత్ లో సామాజిక అల్లిక దెబ్బతింటోదన్న ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు. కరోనా వేళ దేశంలో రెండొంతుల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తున్నామని, ఎవరి పట్లా వివక్ష చూపడంలేదని, ప్రభుత్వం అందుబాటులో ఉంచిన డేటాను చూస్తే నిష్ఫక్షపాత వైఖరి ఇట్టే అర్థమవుతుందని జైశంకర్ వివరించారు.