కావాలనే పహల్గాం దాడి చేశారు.. పాకిస్థాన్ ను వదలం: చైనా గడ్డపై జైశంకర్ సంచలన వార్నింగ్

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. దాదాపు ఐదేళ్ల తర్వాత చైనా లో అడుగుపెట్టారు జైశంకర్. షాంఘై సహకార సంస్థ సమావేశం(SCO) లో జైశంకర్ ప్రసంగించారు. ఈ మేరకు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండించారు. భారత్ టెర్రరిజం అణచివేస్తామని.. ప్రపంచ దేశాలు ఉగ్రవాదంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రణాళిక ప్రకారమే పహల్గాం దాడి జరిగిందని జైశంకర్ పేర్కొన్నారు.

భారత్- చైనా మధ్య 2020 లో జరిగిన గాల్వన్ లోయ దాడుల తర్వాత తొలిసారి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనాలో పర్యటించారు. షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశంలో పాల్గొనేందుకు రెండు రోజుల పర్యటన ప్రకారం చైనాకు జైశంకర్ వెళ్లారు. అక్కడ జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్, చైనాలకు ఒకేసారి చురకలు అంటించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండించారు. భారత్ లో టెర్రరిజం అణచివేస్తామని.. ప్రపంచ దేశాలు ఉగ్రవాదంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రణాళిక ప్రకారమే పహల్గాం దాడి జరిగిందని జైశంకర్ పేర్కొన్నారు.

ఈ మేరకు ఏప్రిల్ 22న భారత్‌ లో జరిగిన పహల్గాం ఉగ్ర దాడిని ప్రపంచమంతా చూసిందని జైశంకర్ తెలిపారు. ఈ దాడిలో 26 మంది టూరిస్టులు మృతి చెందారని తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లో పర్యాటక రంగాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలని, మత విభజన కోసం ఉద్దేశపూర్వకంగా ఈ దాడి జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఉగ్ర స్థావరాలు లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్లు తెలిపారు.

పహల్గాం ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీవ్రంగా ఖండించిందని జైశంకర్ ఈ సమావేశంలో గుర్తుచేశారు. ఈ దాడులకు పాల్పడిన కుట్రదారులను పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేసిందని అన్నారు. ఈ మేరకు భారత్ లో టెర్రరిజం అణచివేస్తామని.. ప్రపంచ దేశాలు ఉగ్రవాదంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

Jaishankar Slams Pahalgam Attack as Planned Urges Global Fight Against Terrorism in China

ఇక ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది భారత ప్రభుత్వం. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రస్థావరాలపై దాడులు చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 200 మందికిపైగా ఉగ్రవాదులు హతం అయినట్లు కేంద్ర రక్షణశాఖ పేర్కొంది.

అలాగే పాకిస్థాన్ పై భారత్ కఠిన ఆంక్షలు విధించింది. సింధూ జలాల పంపిణీ నిలిపివేత, అటారీ వాఘా బోర్డర్ మూసివేత, ఇరు దేశాల మధ్య గగనతలం మూసివేత, ఇరు దేశాల మధ్య ఎగుమతులు దిగుమతులు, రాకపోకలు నిలిపివేత.. తదితర నిర్ణయాలతో పాకిస్థాన్ ఆర్థిక రంగంపై దెబ్బకొట్టింది భారత్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+