వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జేమ్స్ వెబ్ స్పేస్ టెలీస్కోప్ లాంచింగ్: విశ్వంలోని రహస్యాలను చేధించనున్న టైమ్ మిషిన్..?

|
Google Oneindia TeluguNews

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) మరో అద్భుతమైన ప్రయోగం చేసింది. సైంటిస్టులు జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించారు. మిషన్ లా పనిచేసే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‎ను గయానా స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేశారు. దీంతో ‎విశ్వంలోని రహస్యాలను చేధించనున్నారు.

గత కాల ప్రయాణాన్ని సుసాధ్యం చేసే టైం మెషీన్‌ మాదిరిగా పనిచేయనుంది. అపోలో అంతరిక్ష ప్రయోగ రూపకల్పనలో పాలు పంచుకున్న జేమ్స్‌ ఇ.వెబ్‌ పేరునే దీనికి పెట్టారు. హబుల్‌ టెలిస్కోప్‌ వారసత్వాన్ని కొనసాగించటానికి రంగంలోకి దిగుతున్న దీనికి షార్ట్‌ ఫామ్‌లో 'వెబ్‌' అని పిలుస్తున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, యూరోపియన్‌ స్పేస్‌ అకాడమీ, కెనడియన్‌ స్పేస్‌ ఏజెన్సీలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. క్రిస్మస్ సందర్భంగా ఖగోళ శాస్త్రవేత్తలు, స్కైవాచర్లకు నాసా ప్రత్యేక కానుకను ఇచ్చింది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.50 దీనిని ప్రయోగించారు.విశ్వంతారాళంలో అనేకానేక ప్రయోగాలు చేసి, తెలియని ఎన్నో రహస్యాల అంతు తేల్చిన నాసా సైంటిస్టులు జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ను అంతరిక్షంలోకి పంపించారు.

అంతరిక్షంలోకి ఈ ప్రయోగం చేయడం 25 ఏళ్ల కల నెరవేరబోతుంది. నాసా/ఈఎస్ఏ/సీఎస్ఏ సంయుక్తంగా ప్రయోగించాయి. ఇందుకోసం 75 వేల 540 కోట్ల వ్యయం చేసింది. కక్ష్య 30 నిమిషాల పాటు తిరగనుంది. ఇదీ భూమి నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉండనుంది. అలలా తిరుగుతూ వచ్చేనెలలో ఎల్ 2 పాయింట్‌కు చేరుకుంటుంది.

James Webb Space Telescope launched: time machine will see the moment our universe came to life

English summary
James Webb Space Telescope, a successor to the legendary Hubble Space Telescope launched from Europe's Spaceport in French Guiana on board the powerful Ariane-5 rocket to a destination nearly 15,00,000 kilometres away from its home planet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X