భూమికి లక్షన్నర మిలియన్ కిలోమీటర్ల దూరంలో..విశ్వాన్ని జల్లెడ పట్టేలా

వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ.. నాసా ప్రయోగించిన అత్యంత శక్తిమంతమైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తన చివరి గమ్యస్థానానికి చేరుకుంది. భూగోళం నుంచి లక్షన్నర మిలియన్ కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న గమ్యస్థానం ఇది. అక్కడి నుంచి విశ్వం మొత్తాన్నీ జల్లెడ పట్టడానికి నాసా ప్రయోగించిన టెలిస్కోప్ ఇది. నెల రోజుల ప్రయాణం తరువాత గమ్యాన్ని అందుకుంది. చివరి ల్యాప్‌లో భాగంగా సెకెండ్ లాంగ్రాజ్ పాయింట్‌ను చుట్టాల్సి ఉంది.

ఈ మేరకు నాసా ఓ ట్వీట్ చేసింది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ప్రయోగం విజయవంతమైందని, తన గమ్యస్థానానికి చేరుకుందని తెలిపింది. కిందటి నెల 25వ తేదీన నాసా ఈ స్పేస్ టెలిస్కోప్‌ను అంతరిక్షంలోకి పంపించింది. ఫ్రెంచ్ గయానాలోని గయానా స్పేస్ సెంటర్ నుంచి దీన్ని ప్రయోగించింది. ఈ నెల 8వ తేదీన భూకక్ష్యను దాటుకుంది. అంతరిక్షంలోకి ప్రవేశించింది. తన గమ్యానికి చేరుకోవడానికి తాము ఈస్టర్న్ టైమ్ ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటలకు స్సేస్ టెలిస్కోప్ థ్రస్టర్స్‌ను 296 సెకెండ్ల పాటు.. అంటే దాదాపు అయిదు నిమిషాల పాటు మండించామని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.

James Webb Space Telescope reaches final destination, around 1.5 million kilometres away from the earth

ఇక్కడి నుంచి సూర్యుడు-భూమి సెకెండ్ లాంగ్రాంజ్ పాయింట్‌ను చుట్టాల్సి ఉందని, దీనివల్ల విశ్వాన్ని మరింత స్పష్టంగా చిత్రీకరించగలుగుతుందని, సమగ్రవమైన వివరాలను అందజేయగలుగుతుందని చెప్పారు. టెలిస్కోప్‌కు అమర్చిన ఆప్టిక్స్‌ను ద్వారా మూడు నెలలపాటు అంతరిక్షాన్ని అధ్యయనం చేయడానికి అవసరమైన ప్రక్రియను ఇప్పుడు తాము ప్రారంభించాల్సి ఉందని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ చెప్పారు.

విశ్వానికి సంబంధించిన పూర్తి రహస్యాలను వెలికి తీయడానికి తాము ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నామని, ఫైనల్ ల్యాప్ పూర్తి కాగానే తమ పని ప్రారంభిస్తామని చెప్పారు. ఈ స్పేస్ టెలిస్కోప్ చిత్రీకరించిన మొట్ట మొదటి ఫొటోలు, డేటా.. అంతరిక్ష సమాచారాన్ని ఇంకో మూడు నెలల్లో తెలుసుకోవచ్చని వ్యాఖ్యానించారు. అంతరిక్షంలో మరో జీవం ఉనికిని తెలుసుకోవడానికి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కో‌ప్‌ను ప్రయోగించారు నాసా శాస్త్రవేత్తలు.

Recommended Video

    2021 Year Ender : Space Missions In 2021 | Oneindia Telugu

    ఇంకో మూడు నెలల్లో ఇది తన కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. గ్రహాలు, నక్షత్రాలు, నెబ్యులా, గెలాక్సీ, మిల్కీ వే, సౌర కుటుంబం, సోలార్ సిస్టమ్.. ఇలా అన్నింటినీ వడపోస్తుంది. అందులో ఉండే ప్రతి అణువునూ నిశితంగా పరిశీలిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నాసా శాస్త్రవేత్తలకు చేరవేస్తుంది. వాటన్నింటినీ క్రోడీకరించిన తరువాత పూర్తిస్థాయిలో పరిశోధనలను సాగిస్తామని.. ఇప్పటిదాకా ప్రపంచానికి తెలియని అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని బిల్ నెల్సన్ చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+