వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

James Webb Space Telescope : అనంత విశ్వం రహస్యాల చేధన : మూడు దశాబ్దాల కల- టైం ఫిక్స్..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

మరో అద్బుత ఘట్టానికి తెర లేచింది. ఇప్పటివరకు నాసా ఎన్నో కొత్త ప్రయోగాలను చేపట్టి ప్రపంచవ్యాప్తంగా ఎవరూ ఊహించలేని మార్పులను తీసుకొచ్చింది. తాజాగా 'జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్' పేరుతో మరో టెలిస్కోప్‌ను స్పేస్‌లోకి పంపనుంది నాసా. ఒక రౌండ్ గాజుముక్క ఆకారంలో ఉండే ఈ వెబ్ టెలిస్కోప్ ప్రయాణం ఇంకా స్పేస్‌లోకి మొదలు కాకముందే అందరూ దీని గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. టెక్నాలజీ ఎంత పరివర్తన చెందినా కూడా ఇంకా ఏం చేస్తే మెరుగుపడుతుంది అనేదానిపై నాసా పరిశోధకులు ఎప్పుడూ కృషి చేస్తుంటారు. తాజాగా మరో ప్రయోగానికి నాసా సిద్ధమయ్యింది.

విశ్వం గుట్టు చేధించే ప్రయత్నం

విశ్వం గుట్టు చేధించే ప్రయత్నం

మిషన్ లా పనిచేసే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ లాంచ్ కు సమయం దగ్గర పడుతోంది. గయానా స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేయనున్నారు. దీని ద్వారా ఈ విశ్వం గుట్టు చేధించేందుకు శాస్త్రవేత్తలు ఎదురు చూస్తున్నారు. ఒకరకంగా దీన్ని గత కాల ప్రయాణాన్ని సుసాధ్యం చేసే టైం మెషీన్‌ ఇది. అపోలో అంతరిక్ష ప్రయోగ రూపకల్పనలో పాలు పంచుకున్న జేమ్స్‌ ఇ.వెబ్‌ పేరునే దీనికి పెట్టారు. హబుల్‌ టెలిస్కోప్‌ వారసత్వాన్ని కొనసాగించటానికి రంగంలోకి దిగుతున్న దీన్ని పొట్టిగా 'వెబ్‌' అనీ పిలుచుకుంటున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, యూరోపియన్‌ స్పేస్‌ అకాడమీ, కెనడియన్‌ స్పేస్‌ ఏజెన్సీలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి.

10 బిలియన్ డాలర్ల ఖర్చుతో

10 బిలియన్ డాలర్ల ఖర్చుతో

ఇది ఇన్‌ఫ్రారెడ్‌ విజన్‌తో 1350 కోట్ల సంవత్సరాల వెనక్కి చూడగలదు. విశ్వం తొలి నాళ్లలో చీకట్లోంచి నక్షత్రాలు, నక్షత్ర మండలాలు పుట్టు కొస్తున్న తీరును కళ్లకు కట్టగలదు. వందల కోట్ల ఏళ్లుగా నక్షత్ర మండలాలు ఎలా కలిసిపోతున్నాయనేది అర్థం చేసుకోవటానికి ఇది సహకరిస్తుంది. 21 అడుగుల పొడుగు ఉండే ఈ వెబ్ టెలిస్కోప్ తయారీకి 10 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది నాసా. ప్రపంచంలోని అతిపెద్ద రాకెట్స్‌లో ఒకటైన ఏరియెన్ 5లో కూడా ఈ వెబ్ టెలిస్కోప్ సరిపోదు. నాసాతో పాటు 'యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ' కూడా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తయారీలో కీలక పాత్ర పోషించింది.

2007 నుంచి ప్రయత్నాలు

2007 నుంచి ప్రయత్నాలు

డిసెంబర్ 24లోపు ఈ టెలిస్కోప్‌ను స్పేస్‌లోకి పంపించాలని నాసా ప్రయత్నిస్తోంది. అసలు భూమిపైనే మానవ జీవనం ఎందుకు మొదలయ్యింది, ఇంత పెద్ద విశ్వంలో మనిషి భూమిపైన మాత్రమే ఎలా బ్రతకగలుగుతున్నాడు అన్న అంశాలను తెలుసుకోవడానికి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఉపయోగపడనుంది. కేవలం భూమి గురించే కాదు.. ఈ వెబ్ టెలిస్కోప్ ఇతర గ్రహాల గురించి కూడా స్టడీ చేసి వాటి సమాచారాన్ని నాసాకు అందిస్తుంది. దీన్ని 2007లోనే ప్రయోగించాలని అనుకున్నా ఏళ్లకేళ్లుగా వాయిదా పడుతూనే వచ్చింది.

టైమ్ మిషన్ తరహాలో సమాచారం మొత్తం

టైమ్ మిషన్ తరహాలో సమాచారం మొత్తం

అసలు ఇలాంటి టెలిస్కోప్‌ ప్రయోగం సాధ్యమే కాదని చాలామంది అనుమానించారు. దీన్ని విశ్వం ఏర్పడినప్పటి తొలి నక్షత్రాలను చూసేలా టైమ్‌మిషిన్‌ తరహాలో రూపొందించటమూ కాలయాపనకు దారితీసింది. దీని నిర్మాణానికి 50కోట్ల డాలర్ల ఖర్చు అవుతుందని మొదట్లో భావించారు. అత్యంత సంక్లిష్టమైన, వినూత్న డిజైన్‌తో కూడిన దీన్ని పూర్తి చేయటానికి సుమారు 730 కోట్ల డాలర్లు ఖర్చయ్యింది.

English summary
James Webb Space Telescope uses infrared sensors to scan the universe, the Hubble telescope was using visible light, then infra red vision was added. But James Webb will go one step further which can see stars, galaxies which are too old and too distant for Hubble to observe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X