సంచలనం: ట్రంప్ ఓకే అంటే.. ఉత్తరకొరియాపై మేమూ రెడీ: జపాన్ ప్రధాని వ్యాఖ్యలు

జపాన్ ప్రధాని షింజోఅబే ఉత్తరకొరియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అండగా నిలబడితే తాము ఉత్తరకొరియాపై దాడి చేసేందుకు సహకారం అందిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.

వాషింగ్టన్/టోక్యో: జపాన్ ప్రధాని షింజోఅబే ఉత్తరకొరియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అండగా నిలబడితే తాము ఉత్తరకొరియాపై దాడి చేసేందుకు సహకారం అందిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వార్త అమెరికాకు నైతిక మద్దతునిచ్చిందని అమెరికా మీడియా అభిప్రాయపడింది. శుక్రవారం ఉత్తరకొరియా ప్రయోగించిన బాలిస్టిక్ మిస్సైల్‌తో తాము కలవరం చెందామని జపాన్ ప్రధాని షింజోఅబే అన్నారు.

shinzo-abe-trump

అమెరికా ముందడుగు వేస్తే తాము తప్పకుండా అనుసరిస్తామని ఆయన చెప్పారు. చైనా, రష్యాలు కూడా ఈ విషయంలో తమ స్పందన తెలియజేయాలని కోరుతున్నారు.
ఉత్తరకొరియాకు అన్నివిధాల సహకరిస్తున్న చైనా ఉద్రిక్తతలను పెంచేందుకు శతవిధాలా కృషి చేస్తుందని జపాన్ ప్రధాని షింజోఅబే విమర్శించారు.

అయితే తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఉత్తరకొరియాపై దాడి చేయాల్సి వస్తే అమెరికాకు సహకరిస్తామన్నారు. ఎందుకంటే చైనా ఉత్తరకొరియాను తమపై ఉసికొల్పి లబ్ధిపొందాలని చూసే అవకాశం ఉందని ఆయన అన్నారు.

ఒకవేళ యుద్ధం రావాలని ఉత్తరకొరియా, చైనాలు భావిస్తే వారికి ముందుగా టార్గెట్ అయ్యేది జపాన్, దక్షిణకొరియాలేనని అబే అంటున్నారు. అమెరికాను ఎదుర్కొనే శక్తి చైనాకు, ఉత్తరకొరియాకు లేవని తాను భావిస్తున్నానని తెలిపారు. దక్షిణకొరియా కేంద్రంగా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాలని అమెరికాకు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+