వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ మొదలైందా?: ఉ.కొరియా నుంచి ఆ 'సిగ్నల్స్'.. జపాన్ కథనంతో అలర్ట్..

ఉత్తరకొరియా మరో అణు ప్రయోగానికి సిద్దపడుతున్నట్లు తాజాగా జపాన్ కు కొన్ని రేడియో సిగ్నల్స్ అందాయి.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Radio signals hint at North Korea next Step

టోక్యో/ప్యోంగ్‌యాంగ్: గత సెప్టెంబర్ నెల దాకా అణుప్రయోగాలతో ప్రపంచ దేశాలకు వెన్నులో వణుకు పుట్టించిన ఉత్తరకొరియా.. ఆ తర్వాత కాస్త వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. ఉత్తరకొరియా వెనక్కి తగ్గినా.. అమెరికా మాత్రం తన నిఘాను తగ్గించలేదు.

ఇదొక్కటి చాలు: ఉ.కొరియాలో ప్రజల దుస్థితి చెప్పడానికి, ఆఖరికి చావులోను..ఇదొక్కటి చాలు: ఉ.కొరియాలో ప్రజల దుస్థితి చెప్పడానికి, ఆఖరికి చావులోను..

ఉత్తరకొరియా నుంచి ఎప్పుడెలాంటి విపత్కర ప్రమాదాన్ని ఎదురవుతుందోనన్న ఉద్దేశంతో.. జపాన్, దక్షిణ కొరియా దేశాల సహాయంతో నిరంతర నిఘాను కొనసాగిస్తూనే ఉంది.

8 నిజాలు: కిమ్ గురించి ప్రపంచానికి తెలియనవి, అదొక మిస్టరీ, దానికి డై-హార్డ్ ఫ్యాన్?8 నిజాలు: కిమ్ గురించి ప్రపంచానికి తెలియనవి, అదొక మిస్టరీ, దానికి డై-హార్డ్ ఫ్యాన్?

ఇటీవలి కాలంలో మునుపటి స్థాయి ఉద్రిక్తతలు అంతగా చోటు చేసుకోలేదు. దీంతో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ యుద్దం ఆలోచన విరమించుకున్నారా? అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే అదే నిజమనుకోవడానికి లేదు. జపాన్‌కు అందిన కొన్ని రేడియో సిగ్నల్స్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

 రేడియో సిగ్నల్స్:

రేడియో సిగ్నల్స్:

ఉత్తరకొరియా మరో అణు ప్రయోగానికి సిద్దపడుతున్నట్లు తాజాగా జపాన్ కు కొన్ని రేడియో సిగ్నల్స్ అందాయి. అయితే ఆ సిగ్నల్స్ అసాధారణమైనవేమి కాకపోవడం, శాటిలైట్ ఛాయా చిత్రాల్లోను ఉత్తరకొరియా కొత్త యాక్టివిటీకి సంబంధించిన చిత్రాలేవి లేకపోవడం గమనార్హం. జపనీస్ ప్రభుత్వం మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది.

'రుతుస్రావం'.. కొన్ని కఠిన నిజాలు: ఉ.కొరియాలో మహిళా సైనికుల దీనగాథ.. స్నానం చేయాలన్నా!'రుతుస్రావం'.. కొన్ని కఠిన నిజాలు: ఉ.కొరియాలో మహిళా సైనికుల దీనగాథ.. స్నానం చేయాలన్నా!

క్యోడో న్యూస్ ఏజెన్సీ:

క్యోడో న్యూస్ ఏజెన్సీ:

జపాన్ మీడియా సంస్థ క్యోడో న్యూస్ ఏజెన్సీ ద్వారా 'ఉత్తరకొరియా రేడియో సిగ్నల్స్' విషయం వెలుగుచూసింది. సోమవారం ఈ వార్తను ప్రసారం చేసిన సదరు మీడియా.. ఉత్తరకొరియా నుంచి రేడియో సిగ్నల్స్ వెలువడగానే జపాన్ ప్రభుత్వం అప్రమత్తమైందని తెలిపింది. అతి త్వరలో ఉత్తరకొరియా అణుప్రయోగానికి సిద్దపడవచ్చునని కూడా పేర్కొంది. అయితే ఈ సిగ్నల్స్ ఉత్తరకొరియాలోని 'శీతాకాల సైనిక శిక్షణ'కు సంబంధించినవి అనే వాదన కూడా వినిపిస్తోంది.

భయంకరమైన నిజాలు: భూతల నరకం ఉ.కొరియా, ప్రపంచానికి తెలియని అక్కడి బతుకు?భయంకరమైన నిజాలు: భూతల నరకం ఉ.కొరియా, ప్రపంచానికి తెలియని అక్కడి బతుకు?

స్పందించిన పెంటగాన్:

స్పందించిన పెంటగాన్:

జపాన్ న్యూస్ ఏజెన్సీ కథనంపై పెంటగాన్ ప్రతినిధి కొలనెల్ రాబర్ట్ స్పందించారు. ఇక నుంచి ఉత్తరకొరియాను అమెరికా మరింత దగ్గరగా గమనిస్తుందని తెలిపారు. ప్రస్తుతం దక్షిణకొరియా, అమెరికా సైన్యాలు రెండు అత్యంత పటిష్టంగా ఉన్నాయని, ఉత్తరకొరియా దాడులను అడ్డుకునే సామర్థ్యం తమకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

నమ్మలేని నిజాలు?: ప్రపంచానికి తెలియని 'ఉ.కొరియా' ఇది.., అంతా ఆశ్చర్యమే!నమ్మలేని నిజాలు?: ప్రపంచానికి తెలియని 'ఉ.కొరియా' ఇది.., అంతా ఆశ్చర్యమే!

సెప్టెంబర్ నెల నుంచి:

సెప్టెంబర్ నెల నుంచి:

ఈ ఏడాది దాదాపు 11 అణు క్షిపణులను ప్రయోగించిన ఉత్తరకొరియా.. గత సెప్టెంబర్ నెల నుంచి ఆ ప్రయోగాలను తాత్కాళికంగా నిలిపివేసింది. అమెరికా ఆధీనంలోని గువామ్ ద్వీపం లక్ష్యంగా

చివరిసారిగా జపాన్ మీదుగా హోక్కైడో తీరంలో ఉత్తరకొరియా అణుదాడులు జరిపింది. ఆ తర్వాత నుంచి ఉత్తరకొరియా వ్యూహాత్మక మౌనం దాల్చింది. అప్పటిదాకా అమెరికాతో ఢీ అంటే ఢీ అనే రీతిలో కొనసాగించిన మాటల యుద్దానికి కూడా తెరదించింది.

English summary
Japan has detected radio signals suggesting North Korea may be preparing for another ballistic missile launch, although such signals are not unusual and satellite images did not show fresh activity, a Japanese government source said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X