వికలాంగులపై ఉన్మాది దాడి: 19 మంది మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

టోక్యో: జపాన్ రాజధాని టోక్యోలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నగరం శివారులో ఉన్న సాగమిహరలోని ఓ వికలాంగుల ఆశ్రమంపై ఉన్మాది కత్తితో దాడి చేశాడు. విచక్షణారహితంగా చేసిన ఈ దాడిలో 19 మంది మరణించగా, 25 మంది దాకా గాయపడ్డారు.

గాయపడినవారిలో 20 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దాడి చేసిన తర్వాత దుండగుడుపోలీసులకు లొంగిపోయాడు. అతన్ని ఆశ్రమం పూర్వ ఉద్యోగిగా గుర్తించారు. పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఆ పని తానే చేశానంటూ 26 ఏళ్ల యువకుడు లొంగిపోయాడు.

Murder - crime

కత్తి ధరించిన ఓ వ్యక్తి లోనికి వస్తున్నాడని తమకు తెల్లవారు జామును రెండున్నర గంటల సమయంలో ఫోన్ వచ్చిందని పోలీసులు చెప్పారు. వికలాంగులంతా అంతమై పోవాలని అనుమానితుడు అన్నట్లు చెబుతున్నారు. నిందితుడిని సతోషి ఉమాత్సుగా గుర్తించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
At least 19 people were killed and dozens wounded in Japan after a knife-wielding man went on a rampage at a care centre for the mentally disabled early today, officials said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి