మరో హైస్పీడ్ బుల్లెట్ రైలు జపాన్ శ్రీకారం..వేగం తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది
టోక్యో : బుల్లెట్ ట్రైన్స్‌కు పెట్టింది పేరు జపాన్. ఆదేశంలో బుల్లెట్ ట్రైన్లు ఎక్కువగా పరుగులు తీస్తాయి. తాజాగా మరో హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్‌కు జపాన్ శ్రీకారం చుట్టనుంది. గంటకు 400 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా ఈ బుల్లెట్ రైలును రూపొందించారు. టెస్టు రన్‌లో అంతా సవ్యంగా సాగితే రవణా రంగంలో మరో విప్లవాత్మకమైన మార్పు వచ్చినట్లే అవుతుంది.

షిన్‌కాన్‌సేన్ రైలులో మరో వర్షెన్
ఆల్ఫా-ఎక్స్ వర్షెన్‌కు చెందిన షిన్‌కాన్‌సేన్ రైలును రూపొందించేందుకు మూడేళ్ల సమయం పట్టింది. అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకుంటే 2030 నాటికి ఈ హైస్పీడ్ బుల్లెట్ రైలు పట్టాలు ఎక్కుతుంది. ప్రవేశ పెట్టిన కొత్తలో గంటకు 360 కిలోమీటర్ల వేగంతో రైలు పరుగులు తీస్తుందని అధికారులు తెలిపారు. చైనాలోని ఇదే ఆల్ఫా ఎక్స్ వర్షెన్ బుల్లెట్ రైలు ఉన్నప్పటికీ జపాన్ రైలుతో పోలిస్తే అది 10 కిలోమీటర్ల వేగం తక్కువ అని అధికారులు తెలిపారు. ఇక జపాన్ ప్రవేశపెట్టనున్న హైస్పీడు రైలుకు 10 బోగీలు ఉంటాయని చెప్పారు. ముందర భాగం చాలా పొడవుగా ఉంటుందని అధికారులు వివరించారు.

సెండాయ్ నుంచి ఆవ్ మోరి వరకు ట్రయల్ రన్
హైస్పీడ్ రైలును సెండాయ్ నుంచి ఆవ్‌మోరి వరకు ప్రయోగాత్మకంగా నడుపుతామని జపాన్ అధికారులు తెలిపారు. ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం 280 కిలోమీటర్లు. అర్థరాత్రి తర్వాత ఈ రైలు పట్టాలపై పరుగులు తీస్తుందని ఆ సమయంలో అన్ని పరిశీలించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఇలా వారానికి రెండు సార్లు హైస్పీడ్ రైలును ట్రయల్ రన్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. దీనికంటే ముందు మరో హైస్పీడు రైలు షిన్‌కాన్‌సేన్ ఎన్ 700ఎస్ మోడల్ ట్రైన్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ తరహా రైలు 2020లో పట్టాలు ఎక్కుతుందని చెప్పారు. ఇది గంటకు 300 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుందని చెప్పారు.

వీలైనంత త్వరగా పట్టాలపైకి తెచ్చేందుకు ప్రయత్నం
2020 టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ సమయంకల్లా ఈ కొత్త రైలును పట్టాలెక్కించాలని జపాన్ అధికారులు భావిస్తున్నారు. అయితే అది ఎంత వరకు సాధ్యం అవుతుందో వేచిచూడాలి. టెస్టు రన్ సందర్భంగా ఎంత వేగం పుంజుకుంటుందో అనే అంశంతో సంబంధం లేకుండా ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే జపాన్ రైల్వేలు ప్రవేశ పెట్టిన మ్యాగ్నెటిక్ లివిటేషన్ రైలు స్పీడును మాత్రం ఆల్ఫా ఎక్స్ అందుకోలేదని అధికారులు చెబుతున్నారు. ఈ రైలు వేగం గంటకు 603 కిలోమీటర్లు ఉంటుందని చెప్పారు. 2015లో దీని ప్రయోగించడం జరిగింది.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications