భారత్, అమెరికా, ఆస్ట్రేలియాలతో: చైనాను అడ్డుకునేందుకు జపాన్ ప్లాన్
చైనాను అడ్డుకునేందుకు తమ దేశం భారత్, అమెరికా, ఆస్ట్రేలియాలతో కలిసి వ్యూహాలు రచించాలని చూస్తోందని జపాన్ విదేశాంగ మంత్రి టారో కోనో తెలిపారు.
టోక్యో: చైనాను అడ్డుకునేందుకు తమ దేశం భారత్, అమెరికా, ఆస్ట్రేలియాలతో కలిసి వ్యూహాలు రచించాలని చూస్తోందని జపాన్ విదేశాంగ మంత్రి టారో కోనో తెలిపారు.
త్వరలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జపాన్ ప్రధానమంత్రి షింజో అబే భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో జపాన్ వ్యూహ ప్రణాళికను ఆయన ప్రతిపాదిస్తారన్నారని తెలిపారు.

జపాన్, భారత్, అమెరికా, ఆస్ట్రేలియాల దేశాల నేతలతో ఈ ప్రతిపాదనలపై చర్చించాలని తాము అనుకుంటున్నట్లు తెలిపారు.
వన్ బెల్ట్, వన్ రోడ్ విధానంతో చైనా తన వాణిజ్య విస్తరణను పెంచుకునే యత్నాలు చేస్తోన్న నేపథ్యంలో జపాన్ ఈ చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. ఆసియా నుంచి ఆఫ్రికా వరకు మౌలిక వసతుల పెట్టుబడులను పెంచడమే తమ ధ్యేయమని జపాన్ విదేశాంగ మంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications