• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన ఈ జపాన్ బామ్మ వయస్సెంతో తెలుసా..?

|

జపాన్ : ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న బామ్మ పేరు కానే తనాకా. ఇప్పుడు ఈమె ప్రస్తావన ఎందుకంటారా...? ఈమె వయస్సు 116 ఏళ్లు. అంతేకాదు ఇప్పటికీ బోర్డు గేమ్ ఒతెల్లో చాలా చురుగ్గా ఆడుతుంది. అందుకే ఆమెను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. శనివారం ఉదయం ఫుక్వోకాలో నివసిస్తున్న ఆమె ఇంటి దగ్గరకు వెళ్లి ఆమెకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేట్‌ను అందజేశారు.

Japanese Woman Honored by Guinness as Oldest Person at 116

తనకా జనవరి 2,1903లో జన్మించారు. వారి కుటుంబంలో ఎనిమిది మంది సంతానంగా తనకా ఏడవ సంతానం.1922లో హిదియో తనాకాను ఆమె వివాహం చేసుకున్నారు.వారికి నలుగురు సంతానం కాగా మరొకరిని దత్తత తీసుకున్నారు. ఉదయం 6 గంటలకు నిద్రలేచి ఇక గణితంను చదవడం మొదలు పెడుతుంది.

ప్రీతిరెడ్డి హత్య కేసు: కేసును ఛేధించడంలో తలమునకలైన ఆస్ట్రేలియా పోలీసులు

అంతకుముందు ఈ ఘనత మరో జపాన్ బామ్మ పేరిట ఉండేది. ఆమెపేరు చియో మియాకో. రికార్డు చేసిన సమయంలో చియో మియాకో వయస్సు 117 ఏళ్లు. మియాకో గతేడాది జూలైలో మృతి చెందారు. ఇదిలా ఉంటే జపాన్‌లో చాలామంది అత్యధిక కాలం జీవించినట్లు చరిత్ర తిరిగేస్తే తెలుస్తుంది. అయితే మారుతున్న కాలంలో ఆహారపు అలవాట్లు కూడా మారుతుండటంతో ఊబకాయ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కానీ జపాన్‌లో మాత్రం ఊబకాయ సమస్యలు చాలా తక్కువగానే ఉన్నాయి.ఇక్కడ చేపలు, అన్నం, కూరగాయలు ఆహారంగా తీసుకుంటారు.

జపాన్‌లో వయస్సుకు మంచి గౌరవం లభిస్తుంది. 80 ఏళ్ల వయస్సులో కూడా చాలామంది యాక్టివ్‌గా కనిపిస్తారు. అంటే వారిసొంత పనులు చేసుకుంటూ ఉంటారు. ఒకరిపై ఆధారపడరు.అయితే ఫ్రాన్స్‌కు చెందిన జీన్ లూయిస్ కాల్మెంట్ అనే ఓ మహిళ 122 ఏళ్లు జీవించి గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. ఇక ఆమెను అందుకోవాలంటే తనకా అందుకు చాలా ఏళ్లు వేచిచూడాల్సి ఉంటుంది. మరోవైపు ప్రపంచంలోని అత్యంత అధిక వయస్సున పురుషుడి కోసం కూడా గిన్నిస్ బుక్ వేట ప్రారంభించినట్లు చెబుతోంది.అంతకుముందు జపాన్‌కు చెందిన మసాజో నొనాకా అనే వ్యక్తి 113 ఏళ్లు జీవించి ఈ ఏడాది జనవరిలో తుదిశ్వాస విడిచాడు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 116-year-old Japanese woman who loves playing the board game Othello was honoured on Saturday as the world's oldest living person by Guinness World Records.The global authority on records officially recognized Kane Tanaka in a ceremony at the nursing home where she lives in Fukuoka, in Japan's southwest. Her family and the mayor were present to celebrate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more