Jeff Bezos Space Trip : నేడే జెఫె బెజోస్ అంతరిక్షయానం... ఏ సమయానికి,ఎక్కడ ప్రారంభమవుతుందంటే
ప్రపంచ కుబేరుడు, ఆమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మంగళవారం(జులై 20) అంతరిక్షంలో అడుగుపెట్టనున్నారు. జెఫ్ బెజోస్‌తో పాటు ఆయన సోదరుడు మార్క్,82 ఏళ్ల మాజీ పైలట్ వాలీ ఫంక్,18 ఏళ్ల టీనేజర్ అలివర్ డేమన్ రోదసియాత్రలో భాగస్వాములు కానున్నారు. అంతరిక్షంలోకి వెళ్తున్న అత్యంత పిన్న వయస్కుడిగా అలివర్,అత్యంత పెద్ద వయస్కుడిగా వాలీ ఫంక్ చరిత్రలో నిలవనున్నారు.జెఫ్ బెజోస్‌కి చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ తయారుచేసిన న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో ఈ రోదసియాత్ర జరగనుంది. భవిష్యత్తులో స్పేస్ టూరిజాన్ని అందించాలన్న లక్ష్యంతో జెఫ్ బెజోస్ దీన్ని చేపట్టారు.
పశ్చిమ టెక్సాస్ ఎడారి ప్రాంతంలోని ఓ ప్రదేశం నుంచి భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30గంటల సమయంలో స్పేస్ షెఫర్డ్ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. కేవలం 10 నిమిషాల్లో ఈ యాత్ర ముగుస్తుంది. అంతరిక్షంలోకి వెళ్లే నలుగురు సభ్యుల బృందం అక్కడి నుంచి భూమి అందాలను ఆస్వాదిస్తారు. అసలు బరువు లేని గాలిలో తేలియాడే స్థితిని అనుభూతి చెందుతారు. భూమి నుంచి దాదాపు 62 మైళ్లు(100కి.మీ) ఎత్తులోకి స్పేస్ షెఫర్డ్ ప్రయాణించే అవకాశం ఉంది. రోదసియాత్ర ముగిసిన తర్వాత క్యాప్సూల్ పారాచూట్ల సాయంతో భూమిని చేరుతుంది.

న్యూ షెఫర్డ్ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని... ఎటువంటి సాంకేతిక సమస్యలు లేవని ఫ్లైట్ డైరెక్టర్ స్టీవ్ లానియస్ తెలిపారు. న్యూ షెఫర్డ్ స్పేస్ క్రాఫ్ట్‌లో రాకెట్,క్యాప్సూల్ ఉంటాయి. క్యాప్సూల్‌లో ఆరుగురు ప్రయాణికులు ఉండేలా కేబిన్,బయటకు చూసేందుకు అతిపెద్ద కిటికీలు ఉంటాయి. రాకెట్ పొడవు దాదాపు 60 అడుగులు. 1961లో మొదటిసారిగా అంతరిక్షంలోకి అడుగుపెట్టిన అమెరికన్ అలన్ షెఫర్డ్ మీద దీనికి న్యూ షెఫర్డ్ అని పేరు పెట్టారు.
ఇటీవలే ప్రముఖ బ్రిటీష్ కుబేరుడు రిచర్డ్ బ్రాన్సన్ అంతరిక్షయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. వ్యోమనౌక వీఎస్‌ఎస్ యూనిటీ-22లో రిచర్డ్ సహా ఆరుగురు.. నింగిలోకి దూసుకెళ్లారు. ఇందులో తెలుగమ్మాయి బండ్ల శిరీష కూడా ఉండటం విశేషం. గతంలో 3 సార్లు స్పేస్ క్రాఫ్ట్‌లను అంతరిక్షంలోకి పంపిన వర్జిన్ గెలాక్టిక్... తాజా ప్రయోగంలో మానవసహిత స్పేస్ క్రాఫ్ట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపించగలిగింది. భవిష్యత్తులో సాధారణ ప్రజలకు స్పేస్ టూరిజాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ యాత్ర చేపట్టారు. బ్రాన్సన్ స్పేస్ యాత్ర విజయవంతమైన వారం రోజులకే జెఫ్ బెజోస్ నేత్రుత్వంలోని బృందం అంతరిక్షంలోకి అడుగుపెడుతుండటం గమనార్హం.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications